జనసేనాని పవన్ కళ్యాణ్ ఎన్నడూ లేని విధంగా వైసీపీపై భారీ స్థాయిలో మండిపడ్డాడు. మీడియా ముఖంగా మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఒక్కసారిగా తన ఆక్రోషాన్ని వెల్లగక్కారు. వైసీపీ నేతలకు చెప్పు చూపిస్తూ బండ బూతులు తిట్టారు. వైసీపీ నేతలు రాడ్లు పట్టుకుంటే తాము రాడ్లు పట్టుకుంటామని ఇకనుంచి తనలో వేరే పవన్ను చూస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ఈ నేపథ్యంలోనే విజయవాడ నోవోటెల్లో చంద్రబాబు పవన్ ల భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. భాజపాకు వీడ్కోలు పలికి మరోసారి తెదేపాతో జతకట్టి వచ్చే ఎన్నికలను అంచనాలను మార్చుతారా అనే సందేహాలు రాష్ట్ర ప్రజల్లో నెలకొని ఉన్నాయి. మరి ఏ విషయం తెలియాలంటే ఈ సమావేశంపై పవన్ కానీ చంద్రబాబు స్పందించాల్సి ఉంది.
Chandrababu Meet Pawan: పవన్ కళ్యాణ్‌తో చంద్రబాబు భేటీ.. కారణం అదేనా..?

chandrababu meet pawan kalyan in Novotel in Vijayawada