Site icon Prime9

ORS At PM Modi Swearing: మోదీ ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఓఆర్ఎస్ తాగిన అంబానీ, షారూఖ్ ఖాన్

ORS At PM Modi Swearing

ORS At PM Modi Swearing

ORS At PM Modi Swearing: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రమాణ స్వీకారం ఆదివారం నాడు న్యూఢిల్లీలోని రాష్ర్టపతి భవన్‌లో కన్నుల పండువగా జరిగింది. దేశ, విదేశాల నుంచి పలువురు అతిథులను ఆహ్వానించారు. అలాగే ఇండియా నుంచి బాలీవుడ్‌ స్టార్‌ షారూఖ్‌ ఖాన్‌ కూడా మోదీ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. ఆయనతో పాటు రిలయన్స్‌ ఇండస్ర్టీస్‌ చైర్మన్‌ ముఖేష్‌ అంబానీ, ఆయన కుమారుడు అనంత్‌ అంబానీ కూడా విచ్చేశారు. అయితే అంబానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదు. కొడుకు నిశ్చితార్ధానికి వేలాది కోట్ల రూపాయలు మంచినీళ్లలా ఖర్చు చేశారు. ఇక బాలీవుడ్‌ బాద్‌షా షారూఖ్‌ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తెగ వైరల్‌ అవుతున్న వీడియో విషయానికి వస్తే షారూఖ్‌తో పాటు ముఖేష్‌లు ఇద్దరు కేవలం రూ.31ల విలువ చేసే టెట్రా ప్యాక్‌ ఓఆర్‌ఎస్‌ తమ చేతిలో పట్టుకొని కనిపించారు.

సోడా కన్నా ఓఆర్ఎస్ మేలు..(ORS At PM Modi Swearing)

దీనిపై ఇంటర్నెట్‌లో పలువురు పలు రకాల ఆసక్తికరమైన కామెంట్స్‌ పెట్టారు. షారూఖ్‌, అంబానీలు కూడా మనలాగే ఓఆర్‌ఎస్‌ తాగుతారన్నమాట. మరొకరు అంబానీజీ ఓఆర్‌ఎస్‌ తాగుతున్నారహో అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. మరొకరు తాను కూడా అంబానీల అత్యంత సంపన్నుడై ఓఆర్‌ఎస్‌ తాగాలనుకుంటున్నాను అని జోక్‌ చేశాడు. సోడా డ్రింక్‌ కన్నా ఓఆర్‌ఎస్‌ మేలు అని మరొకరి సలహా‌.. ఆదివారం నాడు అక్కడి వాతావరణానికి ఇది చక్కటి డ్రింక్‌. ఇటీవల షారూఖ్‌ ఖాన్‌కు హీట్‌ స్ర్టోక్‌ తగిలింది. ముందుస్తుగా ఆయన ఓఆర్‌ఎస్‌ తాగుతున్నట్లుందంటూ మరొకరు అనుమానం వ్యక్తం చేశాడు. ఐపీఎల్‌ 2024 మ్యాచ్‌ సందర్బంగా అహ్మదాబాద్‌లో షారూఖ్‌కు హీట్‌ స్ర్టోక్‌ తగిలి ఆస్పత్రిలో చేరారు.

అంబానీ, ఎస్‌ఆర్‌కె ఇద్దరు నమ్మకమైన డ్రింక్ తాగుతున్నారు. షారూఖ్ ఇటీవల తన ఫ్యాన్స్‌కు ఎండాకాలంలో బాగా మంచినీరు తాగండంటూ సలహా ఇచ్చారు. దాన్ని ఒక అభిమాని పోస్ట్‌ చేశారు. ఆస్క్‌ ఎస్‌ఆర్‌కె సెషన్‌లో షారూఖ్‌తో ఈ వేసవిలో వాతావరణం చాలా హాట్‌గా ఉంది. నువ్వు నాకు మరింత హాట్‌ కనిపిస్తున్నావు అంటూ ఎక్స్‌లో పోస్ట్‌ పట్టాడు. దీనికి ఎస్‌ఆర్‌కె సమాధానం ఇస్తూ.. దయచేసి నీంబూపానీ తాగండి.. డీ హైడ్రెట్‌ కాకండి అంటూ సమాధానం ఇచ్చారు. ఆదివారం నాడు మోదీ ప్రమాణ స్వీకారానికి షారూఖ్‌ ఖాన్‌ బ్లాక్‌ ఔట్‌ఫిట్‌తో రాష్ర్టపతి భవన్‌కు వచ్చారు. ఇక అంబానీ విషయానికి వస్తే ఆయన సాధారణ ఆల్‌ వైట్‌ ఔట్‌ఫిట్‌తో కనిపించారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి రజనీకాంత్‌, కంగన రనౌత్‌, అక్షయ్‌కుమార్‌, అనిల్‌కుమార్‌, విక్రాంత్‌ మెస్సీ, రాజకుమార్‌ హిరానీలు తళుక్కుమన్నారు.

 

Exit mobile version
Skip to toolbar