Ysrcp Leaders : టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమావేశమయిన నేపధ్యంలో వైసీపీ నేతలు ఈ భేటీపై విమర్శలు గుప్పించారు. గంగిరెద్దులు సంక్రాంతికి ఇంటింటికి తిరుగుతాయన్నారు. అలాగే చంద్రబాబు ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్లాడని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. డుడు బసవన్నలా తల ఊపడానికే చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యాడని అంబటి రాంబాబు విమర్శలు చేశారు.
సంక్రాంతికి అందరింటికి గంగిరెద్దులు వెళ్తాయి చంద్రబాబు ఇంటికి పవన్కళ్యాణ్ వెళ్ళాడు డుడు బసవన్నలా తల ఊపడానికి ! @ncbn @PawanKalyan
— Ambati Rambabu (@AmbatiRambabu) January 8, 2023
సంక్రాంతి మామూళ్ల కోసమే దత్తతండ్రి దగ్గరికి దత్తపుత్రుడు వెళ్లాడని ఏపీ మంత్రి గుడివాడ అమర్నాద్ విమర్శించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒక్కటేనని తాము ఎప్పటి నుండే చెబుతున్నామని ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గుర్తు చేశారు. రాష్ట్రం కంటే వీళ్ల ప్రయోజనాలే ఈ ఇద్దరికి ముఖ్యమని నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్యాన్ని దోచుకోవడం, దాచుకోవడం కోసమే ఈ ఇద్దరి నేతల ప్రయత్నమని ఆయన అన్నారు.
సంక్రాంతి పండుగ మామూళ్ళ కోసం దత్తతండ్రి@ncbn వద్దకు దత్త పుత్రుడు@PawanKalyan
— Gudivada Amarnath (@gudivadaamar) January 8, 2023
చంద్రబాబు చెప్పినట్టుగా చేస్తున్నాడనే పవన్ కళ్యాణ్ ను దత్తపుత్రుడు అంటున్నామని వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఈ భేటీతో వీరిద్దరి ముసుగు తొలగిపోయిందని ఆయన అన్నారు.ఇప్పుడు చెప్పు తీసుకుని ఎవరిని కొట్టాలో పవన్ చెప్పాలని నిలదీశారు.. ఏపీని వదిలేసి పక్కరాష్ట్రంలో కూర్చుని జీవో నెంబర్-1పై చర్చించడమేంటని ప్రశ్నించారు. ప్యాకేజీకి లొంగిపోయాడు కాబట్టే చంద్రబాబు ఇంటికి పవన్ వెళ్లాడని.. వీళ్ల కలయిక వల్ల ఏపీకి ఒరిగేది ఏమీ లేదని అన్నారు. టీడీపీ రోడ్ షోలలో రెండు వేర్వేరు ఘటనల్లో 13 మంది చనిపోతే పవన్ కళ్యాణ్ పరామర్శించేందుకు వెళ్లలేదని, అలాంటిది రాజకీయాల కోసం పవన్ చంద్రబాబును కలిసేందుకు వెళ్లారని వైఎస్ఆర్ సీపీ ఎంపీ మార్గాని భరత్ అన్నారు. వారి మధ్య ఉన్న ఒప్పందాలు రాష్ట్ర ప్రజలకు తెలుసని అన్నారు.
మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.సంక్రాంతి ప్యాకేజీ కోసమే చంద్రబాబు ఇంటికి పవన్ కల్యాణ్ వెళ్లారని ఎద్దేవా చేశారు. కందుకూరు, గుంటూరు ఘటనల్లో జనం చనిపోతే పరామర్శించలేదని అన్నారు. చంద్రబాబు ఇంటికి వెళ్లడం పవన్ కల్యాణ్ కు సిగ్గుగా అనిపించడం లేదా? అని ప్రశ్నించారు. ఎవరు కలిసినా వైఎస్ జగన్‌ను అంగుళం కూడా కదపలేరని అన్నారు.
https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: http://Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/