Site icon Prime9

yuvaraj Singh : గుడ్ న్యూస్ చెప్పిన యువరాజ్ సింగ్.. ఇప్పుడు సంపూర్ణం అయ్యిందంటూ !

yuvaraj singh post about new baby girl birth to his wife

yuvaraj singh post about new baby girl birth to his wife

yuvaraj Singh : టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ అభిమానులతో ఒక గుడ్ న్యూస్ పంచుకున్నాడు. మోడల్‌, బాలీవుడ్‌ నటి హాజల్ కీచ్ ను యువీ ప్రేమ వివాహం చేసుకున్నారు. 2016, నవంబరు 30న వీరి పెళ్లి జరగగా జనవరి 25, 2022లో బాబు ఓరియోన్‌ జన్మించాడు. కాగా ఇప్పుడు తన భార్య హాజెల్ కీచర్ తాజాగా బంగారం లాంటి పాపకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని యువీ తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. తమ చిన్నారికి ‘ఆరా’ అనే పేరు ఫిక్స్ చేసినట్లు ప్రకటించారు. ఆమె రాకతో తమ ఫ్యామిలీ సంపూర్ణం అయ్యిందని చెప్పారు. గత ఏడాది వీరికి ఓ బాబు పుట్టాడు. ప్రస్తుతం యువరాజ్ కి టీం ఇండియా క్రికెటర్లు శుభాకాంక్షలు చెబుతూ  పోస్ట్ లు పెడుతున్నారు.

ఈ మేరకు సోషల్ మీడియాలో తాజాగా తన కూతురుకు సంబంధించిన ఫోటోలను యూవీ షేర్ చేశారు. భార్య హజెల్ కీచ్ బాబుకు పాలు పట్టిస్తుండగా, యువీ చిన్నారిని ఎత్తుకుని పాలు పెడుతున్నాడు. ఈ ఫోటోకు చక్కటి క్యాప్షన్ రాశాడు. ‘‘మా యువరాణి ఆరా వచ్చేసింది. ఆమె కారణంగా నిద్రలేని రాత్రులు గడుపుతున్నాం. అయినా, సంతోషంగానే ఉంది. ఆరా రాకతో మా కుటుంబం సంపూర్ణం అయ్యింది” అని వెల్లడించాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

టీమిండియా ఆల్ రౌండర్ గా కొనసాగిన యూవీ 2019లో అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి వైదొలిగాడు. భారత క్రికెట్ జట్టు సాధించిన ఎన్నో విజయాల్లో ఆయన కీలక పాత్ర పోషించాడు. 2007 లో టీమిండియా టీ20 ప్రపంచ కప్, 2011లో వన్డే ప్రపంచ కప్ గెలవడంలో ఆయన ఎంతో కృషి చేశాడు. 2007 టీ20 ప్రపంచ కప్‌ లో 6 బంతుల్లో 6 సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 2011 వన్డే ప్రపంచకప్‌లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును పొందాడు. క్యాన్సర్‌ బారి నుంచి కోలుకొని తిరిగి క్రికెట్ జట్టులోకి అడుగు పెట్టి అద్భుత ఆటతీరుతో అలరించాడు. ఇలా ఎందరికో ఆదర్శంగా నిలిచిన యువీకి అభిమానులు సైతం విషెస్ చెబుతూ పోస్ట్ లు పెడుతున్నారు.

 

Exit mobile version
Skip to toolbar