Site icon Prime9

LEO : దళపతి విజయ్ “లియో” మూవీ ట్రైలర్ రిలీజ్.. యాక్షన్ అండ్ ఎమోషన్స్ మిక్స్

thalapathy vijay leo movie trailer released

thalapathy vijay leo movie trailer released

LEO : కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్.. నటిస్తున్న లేటెస్ట్ మూవీ “లియో”. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో విజయ్ సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్, యాక్షన్ కింగ్ అర్జున్ మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. విక్రమ్ వంటి ఇండస్ట్రీ హిట్, ‘మాస్టర్’ తర్వాత విజయ్ – లోకేష్ కాంబినేషన్లో రాబోతున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 19న దసరా కానుకగా తమిళం తో పాటు తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్. టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ మధ్య రిలీజ్ అయిన రెండు సాంగ్స్ కూడా మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకున్నాయి. కాగా ముందుగా ప్రకటించిన మేరకు ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్న లియో (LEO) ట్రైలర్ ఎట్టకేలకు మూవీ యూనిట్ రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ ని గమనిస్తే  ఆద్యంతం పవర్ ప్యాక్డ్ గా ఎమోషన్స్, యాక్షన్ తో నిండిపోయింది.

ట్రైలర్ లో ముందుగా.. విజయ్ వాయిస్ ఓవర్ తో మొదలవుతుంది. అందులో సీరియల్ కిల్లర్ నడిరోడ్డు మీద షూట్ చేస్తున్నాడు.. ఆల్రెడీ రోడ్డు మీద అందరు చనిపోయారు. వాడు చాలా క్రూరుడు.. వాడు అందరిని కాలుస్తున్నాడు.. అప్పుడు దైర్యంగా ఒక పోలీసాఫీసర్ సింహంలా వచ్చి ఆ కిల్లర్ ను కాల్చాడు.. అని చెప్తుండగా ఆ స్టోరీను చూపించారు. ఇక ఆ కిల్లర్ కోసం పోలీసులు వెతుకుతున్నట్లు చూపించారు. ఆ కిల్లర్ ను చంపిన గన్.. పార్దీ (విజయ్) చేతిలో ఉండడంతో.. విలన్స్ అతని చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.

అయితే అది అతను కాదని ఎంత చెప్పినా వినిపించుకోకుండా పార్దీ వెనుక పడతారు. అయితే అతని కుటుంబం జోలికి రావడంతో పార్దీ ఎదురుతిరుగుతాడు. ఈ మాఫియా గొడవల్లో కిల్లర్ ను చంపింది లియో అని తెలుస్తోంది. అసలు ఈ లియో ఎవరు.. కిల్లర్ ను ఎందుకు చంపాడు.. అనేది మూవీ చూసి తెలుసుకోవాలి. ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్ లో ట్రెండింగ్ గా మారింది.

Exit mobile version