Site icon Prime9

Taraka Ratna Health: ఇంకా విషమంగానే తారకరత్న ఆరోగ్యం.. వైద్యులు ఏమన్నారంటే?

tarakaratna-latest-health-update released by narayana hospitals

tarakaratna-latest-health-update released by narayana hospitals

Taraka Ratna Health: నందమూరి తారకరత్న ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉన్నట్లు.. నారాయణ హృదయాలయ వైద్యులు తెలిపారు. ఈ మేరకు తారకరత్న ఆరోగ్యంపై తాజాగా హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.

తీవ్రమైన గుండెపోటుతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్న ఆరోగ్యం విషమంగానే ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. ఆయన ఆరోగ్యానికి సంబంధించిన.. హెల్త్ బులిటెన్ ను ఈ విడుదల చేశారు.

ప్రస్తుతం తారకరత్న వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యులకు అందిస్తున్నామని తెలిపారు.

తారకరత్న ఆరోగ్యం మెరుగుపడుతుందని నందమూరి రామకృష్ణ ప్రకటించారు. ఆ సమయంలో ఎక్మో సాయం.. వెంటిలేటర్ లేకుండానే ఉన్నారని రామకృష్ణ అన్నారు. కానీ సాయంత్రం వైద్యులు విడుదల చేసిన బులిటెన్ లో ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ఈ నెల 27న చిత్తూరు జిల్లా కుప్పంలో యువగళం పాదయాత్రలో తారకరత్న పాల్గొన్నారు.

అదే సమయంలో తీవ్రమైన గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించారు.
మెుదట పీఈఎస్‌ ఆస్పత్రిలో వైద్య చికిత్స అందించారు.

అనంతరం మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించారు.

అక్కడ ప్రత్యేక వైద్య బృందంతో చికిత్స అందిస్తున్నారు.

తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు.. బెంగళూరులోని నారాయణ హృదయాలయ వైద్యులు ప్రకటించారు.

తారకరత్న ఆరోగ్యంపై వైద్యులు హెల్త్‌బులిటెన్‌ విడుదల చేశారు.

ప్రత్యేక బృందం పర్యవేక్షణలో తారకరత్నకు చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు పేర్కొన్నారు.

కార్డియాలజిస్ట్‌లు, న్యూరాలజిస్టులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

ఇప్పటికి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని.. చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు.

కుప్పంలో ప్రారంభించిన యువగళం పాదయాత్రలో తారకరత్న పాల్గొన్నారు.

కొద్ది దూరం నడిచాక ఆయన అకస్మాత్తుగా పడిపోయారు. యువగళం సైనికులు వెంటనే కుప్పం కేసీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఈ పాదయాత్ర చేపట్టారు.

ఆయనకు గుండెపోటు వచ్చినట్లు వైద్యులు తెలిపారు. వెంటనే గమనించిన తెదేపా కార్యకర్తలు ఆయన్ను సమీప ఆస్పత్రికి తరలించారు.

తారకరత్న Taraka Ratna ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్న కుటుంబ సభ్యులు.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version