Site icon Prime9

Helicopter Crash: కూతురును బాగా చూసుకో… కేదార్‌నాథ్ హెలికాప్టర్ ప్రమాదానికి ముందు రోజు భార్యతో పైలట్

Helicopter

Helicopter

 Helicopter Crash: కూతురిని జాగ్రత్తగా చూసుకో. ఆమెకు ఒంట్లో బాగాలేదు.  ఇవి పైలట్ అనిల్ సింగ్ తన భార్యతో చివరిసారిగా మాట్లాడిన మాటలు. మంగళవారం ఉత్తరాఖండ్‌లోని కొండపైన ఛాపర్ కూలిపోవడంతో ఆరుగురు యాత్రికులతో పాటు మరణించడానికి ఒక రోజు ముందు అతను తన భార్యతో సంభాషించాడు. సింగ్ (57) ముంబై అంధేరి శివారులో హౌసింగ్ సొసైటీలో నివసిస్తున్నాడు. అతనికి భార్య షిరీన్ ఆనందిత మరియు కుమార్తె ఫిరోజా సింగ్‌ ఉన్నారు.

ఆరు-సీట్ల ఛాపర్ — బెల్ 407 (VT-RPN) — కేదార్‌నాథ్ ఆలయం నుండి గుప్తకాశీకి యాత్రికులను తీసుకువెళుతుండగా కూలిపోయింది. గరుడ్ చట్టిలోని దేవదర్శిని వద్ద ఉదయం 11.45 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయని రుద్రప్రయాగ్ జిల్లా విపత్తు నిర్వహణ అధికారి నందన్ సింగ్ తెలిపారు. తన భర్త అంత్యక్రియలు నిర్వహించేందుకు తాను, తన కూతురు న్యూఢిల్లీకి వెళ్లనున్నట్లు ఆనందిత తెలిపారు.

అతను మాకు సోమవారం చివరిసారిగా కాల్ చేసాడు నా కుమార్తె ఆరోగ్యం బాగా లేదు. ఆమెను జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడని ఆనందిత తెలిపారు.సింగ్, గత 15 సంవత్సరాలుగా ముంబైలో నివసిస్తున్నారు.ఇది యాక్సిడెంట్ అయినందున తనకు ఎవరిపైనా ఫిర్యాదు లేదని అనందిత చెప్పింది. ఉత్తరాఖండ్ ఎప్పుడూ ప్రతికూల వాతావరణాన్ని కలిగి ఉంటుందని ఆమె చెప్పారు. ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో మరియు డీజీసీఏ బృందాలు హెలికాప్టర్ ప్రమాదంపై విచారణ జరుపుతాయని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

 

 

Exit mobile version