Site icon Prime9

Nara Chandrababu Naidu : చంద్రబాబు బెయిల్ విషయంలో కౌంటర్ దాఖలు చేయాలన్న సుప్రీం కోర్టు.. డిసెంబర్ 8 లోగా !

supreme court post pone judgement on nara chandrababu naidu bail reject petition

supreme court post pone judgement on nara chandrababu naidu bail reject petition

Nara Chandrababu Naidu : తెదేపా అధినేత చంద్రబాబు బెయిల్ రద్దుపై ఏపీ సీఐడి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను.. సుప్రీం కోర్టు డిసెంబర్ 8వ తేదీకి వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను సుప్రీంకోర్టులో ఏపీ సీఐడీ సవాల్ చేసింది. అలానే తాజాగా ఈ కేసుకు సంబంధించి మాట్లాడవద్దని కూడా చంద్రబాబుకి సుప్రీం ఆదేశాలు జారీ చేసింది.

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు సెప్టెంబర్ 8వ తేదీన అరెస్ట్ కాగా.. అక్టోబర్ 31న ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆరోగ్య కారణాలతో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇదే కేసులో ఈ నెల 21న హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. అయితే ఏపీ హైకోర్టులో తమ వాదనలను పరిగణనలోకి తీసుకోకుండానే చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేశారని సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఏపీ సీఐడీ.

చంద్రబాబుకు మంజూరు చేసిన బెయిల్ ను రద్దు చేయాలని ఆ పిటిషన్ లో సీఐడీ కోరింది. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఆంధ్రప్రదేశ్ సీఐడీ తరపున ముకుల్ రోహత్గీ వాదనలు విన్పించారు. ఇవాళ్టికి చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ షరతులు వర్తిస్తాయి. రేపటి నుంచి రెగ్యులర్ బెయిల్ అమల్లోకి రానుంది. దీంతో సుప్రీం కోర్టులో ఏపీ సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. ఇరుపక్షాలు కూడ ఈ విషయమై మాట్లాడవద్దని ఆదేశించింది. రాజకీయ ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించకుండా కట్టడి చేయాలని సీఐడీ చేసిన వినతిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. మరో వైపు ఈ విషయమై ఈ నెల 8వ తేదీకి కౌంటర్ దాఖలు చేయాలని చంద్రబాబుకు సుప్రీం ఆదేశాలు జారీ చేసింది.

Exit mobile version