Site icon Prime9

Super Star Rajinikanth : అభిమాని ఇంటికి వెళ్లిన రజినీకాంత్.. వైరల్ గా వీడియో !

Super Star Rajinikanth visit-a-fan-house and video got viral

Super Star Rajinikanth visit-a-fan-house and video got viral

Super Star Rajinikanth : సూపర్ స్టార్ రజినీకాంత్.. జైలర్ సినిమాతో కమ్‌బ్యాక్ ఇచ్చి వరుస సినిమాలను లైన్ లో పెడుతూ దూసుకువెళ్తున్నారు. ప్రెజెంట్ ‘జై భీమ్’ సినిమా దర్శకుడు టి.జె. జ్ఞానవేల్ దర్శకత్వంలో ‘తలైవర్ 170’ సినిమాలో నటిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌ లో తెరకెక్కిస్తున్న ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేసుకోవడానికి రెడీ అవుతుంది. ఇందులో మంజూ వారియ‌ర్, రితికా సింగ్, దుషారా విజయన్ నటిస్తుండగా.. అమితాబ్, రానా, ఫహద్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇది ఇలా ఉంటే, సోషల్ మీడియాలో రజినీకాంత్ కి సంబంధించిన ఒక వీడియో వైరల్ గా మారింది. ఆ వీడియోలో రజినీకాంత్ ఒక అభిమాని ఇంటికి వెళ్లిన దృశ్యం కనిపిస్తుంది.

గతంలో రజినీకాంత్ యూఎస్ ట్రిప్ కి వెళ్ళినప్పుడు ఒకరోజు ఉదయం మార్నింగ్ వాక్ లో జరిగిన వీడియో ఇది. అమెరికాలో ఉంటున్న ఒక తమిళ్ ఫ్యామిలీ రజిని (Super Star Rajinikanth) చూసి వీధిలోనే ఆయనతో మాట్లాడడం మొదలు పెట్టారు. అయితే ఆ కుటుంబం రజినీని లోపలికి రమ్మని పిలవలేక భయంతో అలాగే మాట్లాడుతున్నారు. ఇక ఇది గమనించిన రజినీకాంత్.. తానే వారితో నేను మీ ఇంటి లోపలికి రానా? అంటూ అడిగారు. దీంతో ఆ కుటుంబం చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది. ఇక రజిని రాకతో ఇంటిలోని వారంతా నిద్ర లేచారు. దీంతో రజిని.. మీ నిద్ర చెడగొట్టానా అంటూ వారితో మాట్లాడిన వైనం అందర్నీ ఆకట్టుకుంటుంది. పాత వీడియో అయిన ఇది.. ఇప్పుడు మళ్ళీ నెట్టింట వైరల్ అవుతుంది. ఇక ఇది చూసిన నెటిజెన్స్.. సూపర్ స్టార్ సింప్లిసిటీకి సలామ్ అంటున్నారు.

 

గతంలో ఇలానే జయనగర్ డిపోకు వెళ్లి బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (బీఎంటీసీ) సిబ్బంది కి పెద్ద సర్ ప్రైజ్ ఇచ్చారు. సిబ్బందితో సుమారు 15 నిమిషాల పాటు సంభాషించారు. బస్సు డ్రైవర్లు మరియు కండక్టర్‌ లు అనుకోకుండా రజినీకాంత్ (Super Star Rajini Kanth) కలవడంతో ఆశ్చర్యంతో మునిగిపోయారు. మెకానిక్‌లు, ఇతర కార్మికులు కూడా ఆయనతో సెల్ఫీలను తీసుకున్నారు.

ఇక రజిని సినిమాలు విషయానికి వస్తే.. తలైవర్ 170 సినిమా షూటింగ్ జరుపుకుంటుంటే, ‘లాల్ సలామ్’ షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ కి సిద్దమవుతుంది. రజిని కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రజిని ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ మూవీ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.

 

Exit mobile version