Site icon Prime9

Actress Sunitha Boya: గీతా ఆర్ట్స్ ఆఫీస్ వద్ద నగ్నంగా బైఠాయించిన నటి సునీత

Sunitha

Sunitha

Tollywood: హైదరాబాద్ లోని గీతా ఆర్ట్స్ ఆఫీస్ వద్ద నటి సునీత బోయ గురువారం రాత్రి నగ్నంగా కూర్చుని ఆందోళనకు దిగింది. తెలుగులో పలు హిట్ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన బన్నీ వాసుపై సునీత బోయ గత కొంతకాలంగా ఆరోపణలు చేస్తోంది.

బన్నీ వాసు తనకు సినిమాల్లో అవకాశమిస్తానని చెప్పి నమ్మించి, వాడుకుని మోసం చేశాడంటూ సునీత పలుమార్లు ఆరోపించింది. వ్యవహారం కోర్టు వరకు వెళ్లింది. సరైన ఆధారాలు లేకపోవడంతో హైకోర్టు కేసు కొట్టేస్తున్నట్లు తీర్పునిచ్చింది. అప్పటి నుండి సైలెంట్‌గా ఉన్న సునీత ఇప్పుడు ఏకంగా నగ్నంగా బైఠాయించింది. పోలీసులు నచ్చజెప్పినా వినలేదు. ఓ యువతి ఆమె ఒంటిమీద వస్త్రాలు కప్పింది.

నిత్యం రద్దీగా ఉండే జూబ్లీ హిల్స్ రోడ్డు మీద సునీత బోయ ఇలా చేయడంతో ట్రాఫిక్‌కి అంతరాయం ఏర్పడింది. గతంలోనూ ఇలానే పలుమార్లు హంగామా చేయడంతో పోలీసులు వచ్చి జూబ్లీ హిల్స్ పోలీసు స్టేషనుకి తీసుకెళ్లడం కూడా జరిగింది. ఆమె మానసిక స్థితి సరిగా లేదని, కావాలనే బన్నీ వాసుని టార్గెట్ చేస్తుందని కూడా అంటున్నారు.

Exit mobile version