Singer Mangli: ప్రముఖ టాలీవుడ్ సింగర్ మంగ్లీకి కర్ణాటకలో ఓ చేదు అనుభవం ఎదురైంది. ఓ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తుండగా.. ఊహించని ఘటన ఎదురైంది.
కొందరు దుండగులు ఆమె కారుపై రాళ్లతో దాడి చేశారు.
కర్ణాటకలోని బళ్లారిలో ఈ ఘటన జరిగింది.
బళ్లారి మున్సిపల్ కళాశాల మైదానంలో జరిగిన బళ్లారి ఫెస్టివ్ కార్యక్రమంలో మంగ్లీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా సీనియర్ నటుడు రాఘవేంద్ర రాజ్‌కుమార్, పునీత్ రాజ్‌కుమార్ భార్య అశ్విని సైతం హాజరయ్యారు.
ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం మంగ్లీ తిరిగి బయలుదేరుతుండగా.. ఆమె కారుపై కొందరు రాళ్లతో దాడి చేశారు.
అయితే.. ఈ దాడి జరగడం వెనక బలమైన కారణం ఉన్నట్లు తెలుస్తుంది. కొన్ని రోజుల క్రితం చిక్కబళ్లాపుర్‌లో
కారణం అదేనా
జరిగిన ఓ కార్యక్రమంలోనూ సింగర్ మంగ్లీ పాల్గొంది. ఆ సమయంలో కన్నడ ప్రజల కోసం కన్నడలో ఏమైనా మాట్లాడాల్సిందిగా యాంకర్ అనుశ్రీ కోరింది.
అయితే.. మంగ్లీ కన్నడలో మాట్లాడలేదు. ఇక్కడ అందరికీ తెలుగు తెలుసు కదా అని.. తెలుగులోనే మాట్లాడింది మంగ్లీ.
అయినా యాంకర్ పట్టుపట్టడంతో.. కన్నడలో మంగ్లీ ఒకట్రెండు మాట్లాడిందంతే!. మంగ్లీ తీరుపై కన్నడ ప్రేక్షకులు కోపం పెంచుకున్నారు.
అప్పట్లో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. నెటిజన్లు మంగ్లీ తీరుపై వ్యతిరేకత వ్యక్తం చేశారు.
కన్నడ ఇండస్ట్రీలో మంగ్లీ అడుగుపెట్టి రెండేళ్లు అవుతున్నా.. ఆమెకు కన్నడ అర్థం కాదా? అని అక్కడి ప్రజలు ప్రశ్నల వర్షం కురిపించారు.
ఇక్కడికి వచ్చి కన్నడలో మాట్లాడేందుకు కూడా ఇబ్బంది పడుతున్నప్పుడు, ఆమెకు అవకాశాలు ఎందుకు ఇస్తారని ఫైర్ అయ్యారు.
ఇప్పుడు ఈ రాళ్ల దాడి వెనుక కారణం కూడా.. మంగ్లీ కన్నడలో మాట్లాడకపోవడమేనని స్పష్టమవుతోంది.
ఈ ఘటనపై మంగ్లీ ఇంకా స్పందించాల్సి ఉంది.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/