Site icon Prime9

Chandra Mohan : తండ్రి పాత్రల్లో ది బెస్ట్ చూపించిన చంద్రమోహన్.. ఆ మూవీ చాలా స్పెషల్ !

special story of chandramohan father character

special story of chandramohan father character

Chandra Mohan : చంద్రమోహన్‌ .. హీరోగా, హాస్య నటుడిగా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా అనేక పాత్రల్లో ఆయన వెండితెరపై వెలిగారు. తెలుగులో ఒకప్పుడు గొప్ప హీరోయిన్లు వెలిగిన వారందరూ తొలుత చంద్రమోహన్‌ సరసన నటించిన వారే. తెలుగు, తమిళ్ లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలతో ప్రేక్షకులని మెప్పించిన నటుడు చంద్రమోహన్. వయో భారంతో గత కొంతకాలంగా పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఇటీవల గుండెకి సంబంధించి ఆరోగ్య సమస్యలతో హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చేరగా నేడు నవంబర్ 11న ఉదయం 9.45 గంటలకు మరణించారు చంద్ర మోహన్. దీంతో ఒక్కసారిగా సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. పలువురు సినీ ప్రముఖులు ఆయనకు సంతాపం తెలుపుతూ నివాళులు ప్రకటిస్తున్నారు.

హీరోగా, సెకండ్ హీరోగా కెరీర్ లో పలు సినిమాలు చేసి మెప్పించిన చంద్రమోహన్ ఆ తర్వాత సహాయనటుడిగా, కమెడియన్ గా చేశారు. అనంతరం సహాయ నటుడిగా తండ్రి పాత్రల్లో ఎక్కువగా మెప్పించారు. అనేక సినిమాలలో హీరోలకు తండ్రి పాత్రల్లో నటించారు. తండ్రి పాత్రల్లో చంద్రమోహన్ (Chandra Mohan) కి చెప్పుకోవడానికి చాలా పాత్రలు ఉన్నా ఒక్క సినిమా మాత్రం లైఫ్ లాంగ్ గుర్తించుకునేలా చేసి మెప్పించారు,అదే.. 7G బృందావన కాలనీ.

ఈ సినిమాలో చంద్రమోహన్ గారు హీరోకి తండ్రిగా నటించారు. ఓ మిడిల్ క్లాస్ ఫాదర్ గా, కొడుకు సరిగ్గా చదువుకోక, చెప్పిన మాట వినక తిరుగుతుంటే కొడుకుని తిట్టి, కొట్టే పాత్రలో చంద్రమోహన్ మెప్పించారు. ఈ సినిమాలో తండ్రి పాత్రలో జీవించేశారని చెప్పొచ్చు. కొడుకు గురించి గొప్పగా చెప్పే ఎమోషనల్ సీన్ లో కన్నీళ్లు పెట్టించారు. ఈ క్యారెక్టర్ బాగా క్లిక్ అయి ఒక మిడిల్ క్లాస్ ఫాదర్ అంటే ఇలాగే ఉంటాడేమో అనేలా చేశారు. ఈ సినిమా ఇటీవల రీ రిలీజ్ అయినప్పుడు కూడా చంద్రమోహన్ పాత్ర గురించి అంతా మాట్లాడుకున్నారు.

7G బృందావన కాలనీ సినిమా తెలుగు – తమిళ్ లో తెరకెక్కింది. తమిళ్ లో హీరో ఫాదర్ క్యారెక్టర్ విజయన్ అనే నటుడు చేశారు. ఆయన పాత్ర కంటే కూడా చంద్ర మోహన్ (Chandra Mohan) పాత్ర బాగా క్లిక్ అయింది అని ఆ చిత్రయూనిట్ స్వయంగా చెప్పారు. హీరోగా పలు సినిమాలతో మెప్పించినా తండ్రి పాత్రలతోనే చంద్ర మోహన్ అందరికి గుర్తున్నారు. తెలుగు సినిమాల్లో తండ్రి పాత్రలు చేయాలంటే ఆయనే చేయాలి అనేంతలా మెప్పించారు.నేడు, రేపు అభిమానులు, సినీ ప్రముఖుల సందర్శనార్థం ఆయన భౌతిక కాయాన్ని ఉంచి సోమవారం హైదరాబాద్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Exit mobile version