Pathaan Movie : షారుఖ్ ఖాన్ హీరోగా, దీపికా పదుకొనే హీరోయిన్ గా, జాన్ అబ్రహం విలన్ గా సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా పఠాన్.
ఇటీవల జనవరి 25న థియేటర్స్ లో రిలీజయిన ఈ సినిమా భారీ విజయం సాధించింది.
నాలుగేళ్ల తర్వాత షారుఖ్ తెరపై కనిపిస్తుండటంతో అభిమానులు థియేటర్స్ లో సందడి చేస్తున్నారు.
పఠాన్ సినిమా రిలీజ్ కి ముందు నుంచే కలెక్షన్స్ లో రికార్డులు బద్దలు కొడుతుంది.
సినిమా రిలీజ్ కి ముందే అడ్వాన్స్ బుకింగ్స్ తోనే 50 కోట్ల కలెక్షన్స్ ని వసూలు చేసింది.
ఇక మొదటి రోజు పఠాన్ సినిమా 102 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది.
అప్పట్నుంచి రోజుకి 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేస్తూ సరికొత్త రికార్డులు సృష్టిస్తుంది.
సోమవారం నాడు పఠాన్ సినిమా 55 కోట్లకు పైగా గ్రాస్ కల్క్షన్స్ అంటే దాదాపు 25 కోట్ల షేర్ కలెక్షన్స్ వసూలు చేసి ఆరు రోజుల్లో 600 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని దాటింది.
దీంతో పఠాన్ సినిమా యిప్పటికే 300కి పైగా షేర్ కలెక్షన్స్ వసూలు చేసి ప్రాఫిట్స్ లో ఉంది.
వీక్ డేస్ లో కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ వస్తుండటంతో బాలీవుడ్ సంబరపడిపోతుంది.
1000 కోట్ల టార్గెట్ తో పఠాన్ ప్రస్తుతం దూసుకుపోతుంది.
గ్రాండ్ గా పఠాన్ సక్సెస్ ప్రెస్ మీట్..
ఈ తరుణంలోనే తాజాగా సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించారు.
పఠాన్ సక్సెస్ ప్రెస్ మీట్ సోమవారం సాయంత్రం ముంబైలో నిర్వహించారు.
ఈ ఈవెంట్ లో షారుఖ్, దీపికా, జాన్ అబ్రహం, డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ పాల్గొన్నారు.
ఈ ప్రెస్ మీట్ లో షారుఖ్ దీపికా, జాన్ అబ్రహంలతో కలిసి సందడి చేశాడు.
మీడియా వాళ్ళతో జోకులు వేశాడు. ఇక దీపికా, జాన్ అబ్రహం, షారుఖ్, సిద్దార్థ్ ఆనంద్ కలిసి పఠాన్ పాటకి స్టేజిపై స్టెప్పులు వేశారు.
షారుఖ్ స్టైలిష్ గా ఫోజులు ఇచ్చాడు. జాన్ అబ్రహంని ముద్దు పెట్టుకున్నాడు షారుఖ్ ఖాన్. అలాగే దీపికా చేతికి ముద్దుపెట్టాడు.
ఒకర్నొకరు ప్రేమగా హగ్ చేసుకున్నారు. అనేక విషయాలు మాట్లాడిన అనంతరం ఈ సినిమాని పెద్ద హిట్ చేసినందుకు అందరికి థ్యాంక్స్ చెప్పారు చిత్రయూనిట్.
మొత్తానికి ఈ సక్సెస్ ప్రెస్ మీట్ లో షారుఖ్ సరదాగా సందడి చేయడంతో ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి.
అలాగే బాయ్ కాట్ ట్రెండ్ గురించి షారుఖ్ ని ప్రశ్నించగా.. మొదటిసారి ఈ వివాదంపై స్పందించాడు.
షారుఖ్ ఖాన్ మాట్లాడుతూ.. మేం ఎవ్వరం చెడ్డవాళ్లం కాదు. మేము చేసేది స్క్రీన్‌పై పాత్రలు మాత్రమే.
ఆ సినిమానే మాకు ప్రపంచం. సినిమాలని, వినోదాన్ని సీరియస్‌గా తీసుకోకూడదు.
మీతో, అందరితో మేము సోదర భావంతో ఉండాలనుకుంటాం. మాలో మాకు కూడా సోదర భావం ఉంది.
ఇక దీపికా అమర్ అయితే నేను షారూఖ్ అక్బర్, జాన్ ఆంటోనీ ముగ్గురం అమర్ అక్బర్ ఆంటోనీ.
ఇది సినిమా. ఇదే అందరితోనూ ఉంటాం. అలాగే మేము ఎవ్వరిని ద్వేషించం.
ఇప్పుడున్న యువతకు అనుగుణంగా మారేలా ప్రయత్నిస్తున్నాం అని అన్నాడు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/