Sania Mirza -Mohammed Shami :టెన్నిస్‌స్టార్ సానియా మీర్జా మహ్మద్ షమీని పెళ్లి చేసుకోబోతున్నారా? అయితే వీరిద్దరు ఇండియాకు చెందిన సక్సెస్‌పుల్ క్రీడాకారులు. గత దశాబ్ద కాలం నుంచి చూస్తే వీరిద్దరు వారి వారి రంగాల్లో విజేతలుగా నిలిచారు. ఇండియాలో గ్రేటెస్ట్ విమెన్ టెన్నిస్ స్టార్‌గా సానియా నిలవగా.. ఇక షమీ విషయానికి వస్తే పేస్‌బౌలింగ్ ఆయన చాంపియన్. 2023లో వన్ డే ఇంటర్నేషనల్ వరల్డ్‌కప్‌లో ఇండియాను ఫైనల్‌కు తీసుకువెళ్లడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అయితే ఇటీవల కాలంలో సానియా మీర్జా మహ్మద్ షమీని పెళ్లి చేసుకోబోతుర్నారన్న వార్తలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతున్నాయి.
ఇద్దరు విడాకులు తీసుకున్నారు..(Sania Mirza -Mohammed Shami )
ఇక సానియా విషయానికి వస్తే పాకిస్తాన్ క్రికెట్ స్టార్ షోహెబ్ మాలిక్‌తో ఈ ఏడాది ప్రారంభంలోనే విడాకులు తీసుకున్నారు. ఇక షమీ విషయానికి వస్తే ఆయన కూడా తన భార్య హసీన్ జహాన్ విడాకులు ఇచ్చారు. అయితే తాజాగా సానియా, షమీ పెళ్లి జరుగుబోతోందంటూ వచ్చిన వార్తలపై సానియా తండ్రి ఇమ్రాన్ మీర్జా స్పందించారు. ఇవన్నీ ఒట్టి పుకార్లే అని జాతీయ మీడియాతో మాట్లాడుతూ తేల్చారు. ఇప్పటి వరకు ఆమె షమీని కలవనేలేదని స్పష్టం చేశారు.
హజ్ యాత్రకు వెళ్లి వచ్చిన సానియా..
ఇదిలా ఉండగా ఇండియన్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఇటీవల ముస్లిం పవిత్ర స్థలం మక్కాకు హజ్ యాత్ర వెళ్లి వచ్చారు. షోయబ్‌తో విడాకులు తీసుకున్న ఐదు నెలల తర్వాత హజ్‌కు వెళ్లివచ్చారు. ప్రస్తుతం ఆమె కూడా ప్రొఫెషనల్ టెన్నిస్‌నుంచి రిటైర్ అయ్యారు. అయితే ఆమె ప్రస్తుతం టెన్నిస్ కామంటెటర్‌గా కొత్త అవతారం ఎత్తారు. ఇటీవల ఆమె ప్రతిష్టాత్మకమైన ఫ్రెంచి ఒపెన్ 2024కు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. సోషల్ మీడియాలో తన కొత్త అనుభావాలను పంచుకున్నారు. కామంటెటర్‌గా ఇది కొత్త అనుభవం అని ఆమె వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు చేసిన తప్పులను క్షమించాలని అల్లాను కోరానన్నారు. ఇక నుంచి సత్ప్రవర్తన కలిగి ఉంటానని రాసుకొచ్చారు. ఇటీవల సానియా కపిల్ శర్మషోలో కనిపించారు. 2015-16లో మార్టిన్ హంగిస్ పార్టనర్ షిప్‌లో టెన్నిస్ ఆడారు. తన టెన్నిస్ కెరీర్ గురించి కపిల్‌తో తన అనుభవాలను పంచుకున్నారు.