Site icon Prime9

Balakrishna: నా ఫ్యాన్స్‌ని కొట్టడానికి నేను డబ్బులు ఇచ్చి బౌన్సర్లను పెట్టుకోవాలా ? నేనే కొడతా…

sai madhav burra explaination about balakrishna beating fans

sai madhav burra explaination about balakrishna beating fans

Balakrishna : నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి అందరికీ తెలిసిందే. మనసులో ఉన్నది ఉన్నట్టుగా ముక్కు సూటిగా మాట్లాడే వ్యక్తిత్వం బాలయ్య సొంతం. సాధారణంగా బాలకృష్ణ అంటే అందరికీ కొంత భయం ఉంటుంది. సీరియస్ గా , ముక్కుసూటిగా ఉంటారు అని … ఎక్కువ ఫ్రీ గా ఉండరేమో అని ఎక్కువగా అనుకుంటారు. అయితే ఇటీవల ఆహా వేదికగా ప్రసారం అవుతున్న అన్ స్టాపబుల్ షో తో బాలకృష్ణ లోని మరో యాంగిల్ ని అందరూ తెలుసుకోగలిగారు. బాలకృష్ణ ఆఫ్ స్క్రీన్ లో ఇలా ఉంటారా అని అంతా ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యారు అనడంలో సందేహం లేదు. కుర్ర హీరోలతో సైతం సరదాగా కలిసిపోతూ అందరి మనసుల్ని దోచుకున్నారు

ఈ షో కి ముందు కూడా బాలకృష్ణ సన్నిహితులు ఆయనంత జోవియల్ పర్సన్ ఎవరూ ఉండరని పలు సందర్భాల్లో తెలిపారు. బాలకృష్ణ మనస్తత్వం చిన్న పిల్లాడి లాంటిది అని … మాట కఠువుగా ఉన్నా మనసులో మాత్రం బంగారం అంటూ చెబుతూ ఉంటారు. ఒక వైపు సినిమాల్లో రాణిస్తూనే మరో వైపు రాజకీయాల్లోనూ సత్తా చాటుతున్నారు. ఎమ్మెల్యేగా హిందూపురం నియోజకవర్గ ప్రజలకు సేవలందిస్తూనే… బసవతారకం కేన్సర్ హాస్పటల్ ద్వారా ఎంతో మందికి సాయపడుతున్నారు. కానీ గతంలో జరిగిన పలు సంఘటనలను ఇప్పటికీ గుర్తు చేస్తూ బాలకృష్ణపై కావాలని నెగిటివిటీని పెంచేందుకు చూస్తుంటారు.

అంతకు ముందు సెల్ఫీల కోసం, వేరే కారణాలతో వచ్చిన అభిమానులను బాలయ్య చేయి చేసుకున్న ఘటనలు అందరికీ తెలిసినవే. ఇప్పటికీ వాటి గురించి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తుంటారు. వాటి గురించి ఇప్పటి వరకు బాలకృష్ణ నోరు విప్పి మాట్లాడింది కూడా లేదు. కానీ ఆయన ఫ్యాన్స్ మాత్రం కొట్టిన బాలయ్యే, పెట్టిన బాలయ్యే అని మంచిగానే రిసీవ్ చేసుకుంటారు. అయితే బాలకృష్ణ వారిపై చేయి చేసుకోవడానికి గల ఆంతర్యాన్ని ప్రముఖ రచయిత సాయి మాధవ బుర్రా తాజాగా వెల్లడించారు. క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’. ఈ సినిమాకు డైలాగ్ రైటర్ గా సాయి మాధవ్ బుర్రా పని చేశారు. తాజాగా ఓ ప్రముఖ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలకృష్ణ గురించి మనసులో మాటల్ని బయటపెట్టారు.

గౌతమిపుత్ర శాతకర్ణి షూటింగ్ సమయంలో బాలకృష్ణ గారే అభిమానులను కొడతారనే విషయాన్ని తనతో ప్రస్తావించారని సాయి మాధవ్ తెలిపారు. ఆ మేరకు ఆయన మాట్లాడుతూ… హీరోలందరూ బౌన్సర్లను ఎందుకు పెట్టుకుంటున్నారు ? ఫ్యాన్స్‌ను పక్కకి నెట్టి వేసేందుకు, అవసరమైతే కొట్టేందుకే కదా… నిన్నగాక మొన్న వచ్చిన చిన్న హీరోలు కూడా నలుగురు ఐదురుగు బౌన్సర్లను పెట్టుకుంటున్నారు. అంటే నా ఫ్యాన్స్‌ను కొట్టేందుకు… నేనే డబ్బులిచ్చి బౌన్సర్లను పెట్టుకోవాలా ?… నేను ఆ పనిచేయను. అసలు వీళ్లందరూ డబ్బులిచ్చి బౌన్సర్లను ఎందుకు పెట్టుకున్నారో నాకు ఆన్సర్ చెప్పమనండి అని బాలయ్య చెప్పినట్లుగా సాయి మాధవ్ వెల్లడించారు.

అదే విధంగా ఫ్యాన్స్ తనకు ఫ్యామిలీతో సమానమని… అలాంటి తన ఫ్యామిలీని కొట్టేందుకు మధ్యలో వీడెవడు బౌన్సర్ ? అని బాలయ్య తెలిపారన్నారు. కోపమొస్తే ఓ దెబ్బ వేస్తానని… వాళ్లకు ఏదైనా అడగాలి అనుకుంటే నన్ను అడుగుతారని… అంతే తప్ప తమ మధ్యలో బౌన్సర్లు ఎవరని బాలకృష్ణ అన్నారన్నారు. ఇదే విషయాన్ని ఎక్కడైనా ఓపెన్‌గా చెప్తే ఈ ట్రోలింగ్స్, నెగిటివిటీ ఆగుతాయి అని చెప్తే… నాకు అలాంటి అలవాటు లేదు అని బాలకృష్ణ జవాబు ఇచ్చారట. నేనేంటో నా ఫ్యాన్స్‌కు తెలుసు… వాళ్లేంటో నాకు తెలుసు, నేనిది అని చెప్పుకోనని బాలకృష్ణ వ్యాఖ్యానించినట్లు… సాయి మాధవ్ వెల్లడించారు. ఈ విషయం బయటికి రావడంతో బాలకృష్ణ అభిమనులంతా ఆయనని పొగుడుతూ సోషల్ మీడియాలో “జై బాలయ్య ” జై జై బాలయ్య ” అంటూ పోస్ట్ లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Exit mobile version