Actor Surya : ప్రముఖ తమిళ నటుడు సూర్య అంటే తెలియని వారు ఉండరు. తమిళ నటుడే అయిన తెలుగులో కూడా స్టార్ హీరోలకు సమానంగా క్రేజ్ సంపాదించుకున్నాడు. కంటెంట్ ఉన్న సినిమాల్లో నటించి సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. గజిని, సింగం వంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక ఇటీవల వచ్చిన ఆకాశం నీ హద్దురా, జై భీమ్, విక్రమ్ వంటి సినిమాలతో నెక్స్ట్ లెవెల్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం శివ దర్శకత్వంలో ‘సూర్య 42’ (పాన్ ఇండియా) చిత్రంలో నటిస్తున్నారు. ఇక సూర్య- జ్యోతిక జంట 2006లో ప్రేమ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వారికి దియా, దేవ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.
అయితే తాజాగా సూర్యకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. సూర్య తన ఫ్యామిలీతో సహా ముంబైకి షిఫ్ట్ అవుతున్నారనే విషయం ఇప్పుడు చర్చకు వచ్చింది. ఈ క్రమంలోనే ఆయన ముంబైలో రూ. 70 కోట్లతో ఖరీదైన ఫ్లాట్ కూడా కొనుగోలు చేశారని,. సెలబ్రిటీలు ఎక్కువగా నివసించే గేటెడ్ కమ్యూనిటీలోనే ఈ ఫ్లాట్ ఉందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇక ఈ ఫ్లాట్ దాదాపు 9 వేల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగి ఉందని.. త్వరలోనే చెన్నై నుంచి ముంబయికి షిఫ్ట్ అవ్వాలని సూర్య- జ్యోతిక దంపతులు భావిస్తున్నారని తెలుస్తోంది.
70 కోట్ల ఫ్లాట్ లో ఏం ఏం ఉన్నాయంటే (Actor Surya)..?
కాగా, సూర్య కొనుగోలు చేశారని చెప్పుకుంటున్న రూ.70 కోట్ల ఫ్లాట్‌లో గార్డెన్ స్పేస్, అలాగే పార్కింగ్ స్పాట్, స్విమ్మింగ్ పూల్, జిమ్. లైబ్రరీ, థియేటర్ ఇలా అన్ని ఆధునిక హంగులు కలిగి ఉన్నాయట. ఆ ఫ్లాట్ అసలు ధర రూ.68 కోట్లు కాగా.. మిగిలిన రూ.2 కోట్లు అపార్ట్‌మెంట్ బుకింగ్, ఇతర ఖర్చుల కోసం కోసం వెచ్చించినట్లు సోషల్ మీడియా లో పోస్ట్ లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వార్త ఫిల్మ్ ఇండస్ట్రిలో హాట్ టాపిక్ గా మారింది.