Site icon Prime9

Rgv Tweet: రాజమౌళిని చంపేందుకు కుట్ర.. ఆర్జీవీ ట్వీట్‌ వైరల్‌

rgv

rgv

Rgv Tweet: ప్రముఖ దర్శకుడు రాజమౌళిపై రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది. రాజమౌళిని చంపేందుకు కుట్ర చేస్తున్నారని.. ట్వీట్ ద్వారా ఆర్జీవీ తెలిపారు. ఇంకా దీనిపై ఏమన్నారంటే?

బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రాజమౌళి. ఇక ఆర్ఆర్ఆర్ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా దర్శకధీరుడిగా రాజమౌళి ఖ్యాతి ప్రపంచ స్థాయికి చేరింది. ఈ సినిమా భారీ విజయంతో.. పలు అంతర్జాతీయ వేదికలపై రాజమౌళి ప్రసంగించారు.

ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు జేమ్స్ కామెరూన్ లాంటి వ్యక్తే.. ఆర్ఆర్ఆర్ సినిమాపై ప్రశంసలు కురిపించారు.

దీంతో రాజమౌళి ఎంతటి పెద్ద దర్శకుడో అర్ధం అవుతుంది. ఓ భారతీయ దర్శకుడికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు రావడం సినీ చరిత్రలో రికార్డ్ అని చెప్పవచ్చు.

ఆర్ఆర్ఆర్ సినిమా ప్రభావం ప్రపంచంలో ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.

రాజమౌళి తెరకెక్కించిన చిత్రానికి పలు అంతర్జాతీయ అవార్డులు రావడం తెలుగు సినిమా చేసుకున్న అదృష్టం.
రాజమౌళి సినిమాపై ప్రపంచవ్యాప్తంగా పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

అయితే భారతీయ దర్శకులు మాత్రం రాజమౌళిపై ఈర్ష్యతో రగిలిపోతున్నారట.

జక్కన్నను హత్య చేసేందుకు కుట్రలు కూడా చేస్తున్నారని వివాదస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ అన్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలిపాడు.

సామాజిక మాధ్యమాల్లో ఆర్జీవీ చాలా ఆక్టివ్ గా ఉంటారు. సమాజంలో జరుగుతున్న తాజా వార్తలపై తనదైన శైలీలో ఆర్జీవీ స్పందిస్తు ఉంటారు.

దీంతో ఇటీవల ఆర్‌ఆర్‌ఆర్‌కు వరుసగా అంతర్జాతీయ అవార్డులు రావడం.. జేమ్స్‌ కామెరూన్‌ రాజమౌళిపై ప్రశంసలు కురిపించడంపై ఆర్జీవీ ట్విట్టర్ వేదికగా స్పందించారు.

జేమ్స్ కామెరూన్‌తో రాజమౌళి మాట్లాడిన వీడియోని షేర్‌ చేశారు.

మొఘల్ ఈ ఆజాం తీసిన కా ఆసిఫ్ నుంచి.. షోలే తీసిన రమేష్‌ సిప్పీ వరకు అందరినీ నువ్ అధిగమించావు. ఆదిత్య చోప్రాలు, కరణ్‌ జోహర్‌లు, భన్సాలి వంటి వారిని దాటేశావ్. అంటూ ట్వీట్ చేశారు.

ఇక మరో ట్వీట్‌లో రాజమౌళి సర్ దయచేసి మీరు మీ భద్రతను పెంచుకోండి.. ఇండియాలోని ఫిల్మ్ మేకర్స్ అంతా మీ మీద ద్వేషంతో రగిలిపోతు ఉన్నారు.

మిమ్మల్ని చంపేందుకు కుట్ర చేస్తున్నారు. అందులో నేను కూడా ఉన్నాను.. కానీ నేను తాగిన మైకంలో చెప్పేశాను అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే రాజమౌళిని ప్రశంసించడానికే ఈ ట్వీట్స్‌ చేశారు.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version