Pawan Kalyan Varahi Deeksha: జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జూన్ 26 నుండి 11 రోజుల పాటు వారాహి అమ్మవారి దీక్షను ప్రారంభించనున్నారు. ఈ సమయంలో పవన్ పాలు, పండ్లు మరియు ద్రవాలతో కూడిన ఆహారం మాత్రమే తీసుకుంటారు.
వారాహి అమ్మవారి దీక్షను పవన్ కళ్యాణ్ రెండవసారి చేపడుతున్నారు. పవన్ మొదటిసారి గత ఏడాది జూన్‌లో దీనిని స్వీకరించారు. ప్రారంభ దీక్ష సందర్బంగా అమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఎన్నికల్లో ఘనవిజయం సాధించి ఆయన ఏపీ డిప్యూటీ సీఎంగా నియమితులయ్యారు. ఇపుడు మరలా దీక్షను చేపట్టారు.దుర్గా మాతకు ఏడు ప్రతిరూపాలుగా సప్త మాతృకలు ఉంటారు. ఆ సప్త మాతృకలో ఒకరు వారాహి అమ్మవారు. పవన్ తన ఎన్నికల ప్రచార రధానికి అమ్మవారి పేరు కలిసి వచ్చేలా వారాహి అని పేరు పెట్టారు. వారాహి యాత్ర పేరుతో ఏపీ అంతటా పర్యటించారు.