Pawan kalyan- PM Modi: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్డీఏ సమావేశంలో పాల్గొనేందుకు తన భార్య అన్నా లెజినోవా, కుమారుడు అకిరా నందన్‌తో కలిసి ఢిల్లీ వెళ్లారు.ఈ సందర్బంగా ప్రధాని నివాసంలో నరేంద్ర మోదీని కలుసుకున్నారు. పవన్ కుటుంబాన్ని ప్రధాని మోదీ ఆదరంగా పలకరించారు. పవన్ తన కుమారుడు, భార్యను మోదీకి కి పరిచయం చేశారు. ఈ సందర్భంగా మోదీ అకిరా నందన్ మీద చేయి వేసి మాట్లాడుతున్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కూటమి ఏర్పాటులో కీలకపాత్ర..(Pawan kalyan- PM Modi)
గత నెలలో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. 175 స్దానాలు ఉన్న ఏపీ అసెంబ్లీలో టీడీపీ 135, జనసేన 21, బీజేపీ 8 సీట్లను గెలుచుకున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేవలం 11 స్దానాలను మాత్రమే గెలుచుకుని ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేకపోయింది. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ తాను పోటీ చేసిన 21 అసెంబ్లీ సీట్లను గెలుచుకుని చరిత్ర సృష్టించింది. పవన్ కళ్యాణ్ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు. దీనితో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా కూటమిగా ఏర్పాటి పోటీ చేసి ఘనవిజయం సాధించడాని కీలకమయ్యారు.