Site icon Prime9

Twitter Fan Wars : ట్విట్టర్ లో ట్రెండ్ అవుతున్న #orey హ్యాష్ ట్యాగ్.. ఎవర్రా మీరంతా అంటున్న నెటిజన్లు

orey hash tag trending on twitter and fan war between mahesh and prabhas fans

orey hash tag trending on twitter and fan war between mahesh and prabhas fans

Twitter Fan Wars : ప్రస్తుత కాలంలో ఏది ఎప్పుడు ఎందుకు ట్రెండ్ అవుతుందో చెప్పలేకపోతున్నాం. ఇప్పుడు తాజాగా ట్విట్టర్ లో #orey అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ గా మారింది.   

ఈ హ్యాష్ ట్యాగ్ ని గమనిస్తే అందులో ముఖ్యంగా మహేష్ బాబు, ప్రభాస్ అభిమానుల మధ్య ఫ్యాన్ వార్ జరుగుతుందని తెలుస్తుంది.

ఇది ఎక్కడ ఆరంభం అయ్యిందో, ఎందుకు అయ్యిందో తెలియదు కానీ మొత్తానికి అయితే ఓ రేంజ్ లో ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు.

 

 

(Twitter Fan Wars) ఫ్యాన్ వార్స్ వద్దు.. ఇండియన్ సినిమా ముద్దు అంటున్న నెటిజన్లు..

 

ప్రస్తుతం కాలంలో సినిమాలు, రాజకీయాలకు మనుషులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.

ప్రజల్లో రెండు విషయాలు ఎక్కువగా, బలంగా ఉండిపోయాయి.

ఈ రెండు విషయాల్లో ప్రజలు వారి జీవితాల గురించి పట్టించుకోకుండా అనవసరమైన విషయాలపై ఎక్కువ మక్కువ చూపిస్తున్నారేమో అని అనుమానం కూడా కలుగుతుంది.

ఫలానా హీరో కోసమో, ఫలానా రాజకీయ నాయకుడి కోసమే ఒకరిపై మరొకరు దుర్భాషలు ఆడుకుంటూ గోడవలకి దిగుతున్నారు.

రాజకీయాల కారణంగా ఒకరితో మరొకరు పోట్లాడుకోవడం, దాడి చేసుకోవడం, హత్యలు చేసుకోవడం వంటివి గమనించుకోవచ్చు.

కానీ ఇటీవల కాలంలో సినిమా హీరోలపై అభిమానంతో కూడా ప్రజలు ఇలా మారిపోతారేమో అని భయం వేస్తుంది.

ఒక వైపు సినిమా హీరోలంతా మేమే మేము బాగానే ఉంటాం అని బహిరంగంగానే చెప్పుకొని.. బాగానే ఉంటున్నారు.

కానీ వారి అభిమానులే అభిమానాన్ని హద్దులు దాటించి ఇలా ప్రవర్తిస్తుంటారు.

అభిమానం హద్దులు దాటితే అది ఎవరికి మంచిది కాదు. సినిమా హీరోలపై అభిమానం ఉండటంలో తప్పు లేదు కానీ, అది హద్దు మీరితేనే లేనిపోని సమస్యలు ఎదురవుతాయి.

ప్రస్తుతం ఈ ట్విట్టర్ లో హ్యాష్ ట్యాగ్ ని చూస్తే కూడా అదే అనిపిస్తుంది.

గతంలో కూడా పలు సందర్భాలలో హీరోల ఫ్యాన్స్ మధ్య గొడవలు జరిగాయి, కొట్టుకున్నారు. కానీ ఇప్పుడు కాలం మారింది, పరిస్థితులు మారాయి, అందరు కలిసి భాషలతో సంబంధం లేకుండా ఇండియన్ సినిమా అని గర్వంగా చెప్పుకుంటున్నారు.

ఇలాంటి ఈ తరుణంలో కూడా ఈ రకంగా ఫ్యాన్ వార్ లు చేసుకోవడం పట్ల నెటిజన్లు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యంగా అసభ్య పదజాలంతో హద్దులు దాటి ప్రవర్తించడాన్ని అందరూ ఖండిస్తున్నారు.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version