Amsala Swamy Death : నల్గొండ జిల్లా ప్లోరోసిస్ విముక్త పోరాట కమిటీ నాయకుడు అంశాల స్వామి మృతి చెందారు.
ప్రస్తుతం ఆయన వయసు 32 సంవత్సరాలు.
ఈ మేరకు అంశాల స్వామి మృతిపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు.
ఆ పోస్ట్ లో.. ఫ్లోరోసిస్ బాధితుల కోసం నిరంతరం పోరాటం చేసిన వ్యక్తి అంశాలస్వామి. ఆయన ఎంతో మందికి స్పూర్తి. అంశాలస్వామి ఎప్పటికీ నా మనసులో గుర్తుండిపోతాడు. అతని ఆత్మకు శాంతి చేకూరాలని అని కోరుకున్నారు.
గత ఏడాది అక్టోబర్ లో అంశాల స్వామి ఇంటికి వెళ్లి మంత్రి కేటీఆర్ భోజనం చేయడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.
ఫ్లోరైడ్ బాధితుడైన అంశాల స్వామి ఇంటికి వెళ్లిన కేటీఆర్ ఆయనతో కలిసి భోజనం చేశారు.
మునుగోడు ఉపఎన్నిక నామినేషన్ల సందర్భంగా మునుగోడు వెళ్లిన కేటీఆర్.. ఆ తర్వాత శివన్న గూడెంలోని ఫ్లోరైడ్ బాధితుడు అంశాల స్వామిని కలిశారు.
ఆయన తల్లితండ్రుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఆ సందర్భంగా కాసేపు అంశాల స్వామితో కేటీఆర్ మాట్లాడారు. ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
హెయిర్ కటింగ్ సెలూన్, ఇంటి నిర్మాణం గురించి అడిగి తెలుసుకున్నారు.
గతంలోనూ అంశాల స్వామి ఆర్థిక పరిస్థితిని అడిగి తెలుసుకున్న కేటీఆర్ ఆర్థిక సహాయం కూడా చేశారు.
ప్రభుత్వం నుంచి డబుల్ బెడ్ రూమ్ ఇంటి నిర్మాణం కోసం రూ. 5.50 లక్షలు మంజూరు కూడా చేయించారు.
మిగతా ఇంటి నిర్మాణ పనులను కేటీఆర్ కార్యాలయంతో పర్యవేక్షించి పూర్తయ్యేలా చొరవ కూడా చూపారు.
ఇప్పుడు ఆయన మరణంతో వారి కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.
అంశాల స్వామి మరణ వార్తకు సంతాపం తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు.
My Heartfelt condolences to the family of Sri Amshala Swamy Garu who passed away today
He was a fighter who championed the cause of Fluorosis victims & an inspiration to many. He will always remain close to my heart
May his soul rest in peace 🙏 pic.twitter.com/wCv5DHWeGg
— KTR (@KTRBRS) January 28, 2023
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/