Site icon Prime9

Mumbai: సంపన్న నగరాల్లో 25వ స్థానంలో ముంబై

wealthiest-cities--mumbai-ranked-25

Wealthiest cities: ప్రపంచంలో అపర కుబేరుల అడ్డా జాబితా వెల్లడైంది. సంపన్నులు ఎక్కువగా ఉన్న నగరాల్లో న్యూయార్క్, టోక్యో, శాన్‌ ఫ్రాన్సిస్కో, లండన్‌ తొలి నాలుగు స్థానాల్లో నిలిచాయి. రెసిడెన్సీ అడ్వైజరీ సంస్థ ‘హెన్లీ అండ్‌ పార్ట్‌నర్స్‌ గ్రూప్‌’ తాజా నివేదికలో ఈ వివనాలను వెల్లడించింది. సంపన్నులకు అడ్డా అయిన మొదటి 10 నగరాల్లో 5 నగరాలు అమెరికానే ఆక్రమించాయి.

ఈ ఏడాది ప్రధమార్థంలో న్యూయార్క్‌ నగరం 12 శాతం మిలియనీర్లను కోల్పోయింది. అదే సమయంలో శాన్‌ఫ్రాన్సిస్కోలో మిలియనీర్ల సంఖ్య నాలుగు శాతం పెరిగారు. లండన్‌లో మాత్రం 9 శాతం సంపన్నులు తగ్గిపోయారు. సౌదీ అరేబియా రాజధాని రియాద్, యునైటెట్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లోని షార్జాలో సంపన్నుల సంఖ్య శరవేగంగా పెరిగిపోతోంది.

అబూ దాబీ, దుబాయ్‌ సిటీలు బడా బాబులను ఆకర్శిస్తున్నాయి. ధనవంతులు ఆయా నగరాల్లో నివసించేందుకు ఆసక్తి చూపుతున్నారు. తక్కువ పన్నులు, కొత్త కొత్త నివాస పథకాలు అమల్లోకి వస్తుండడమే ఉండడమే దీనికి కారణం. రష్యాలోని సంపన్నులంతా యూఏఈకి తరలి వస్తున్నారు. ఉక్రెయిన్‌ యుద్ధ పరిణామాలు, రష్యా పై ఆంక్షలూ తదితర కారణాల వల్ల రష్యా సంపన్నులు ఇతర దేశాల వైపు చూస్తున్నారు.

సంపన్నుల నగరాల జాబితాలో చైనాలోని బీజింగ్, షాంఘై నగరాలు తొమ్మిది, పదో స్థానాల్లో ఉన్నాయి. ఇక భారత్‌లోని ముంబై నగరం 25వ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది సంపద తరలిపోతున్న దేశాల్లో రష్యా తర్వాత రెండో స్థానం చైనాదేనని ‘హెన్లీ అండ్‌ పార్ట్‌నర్స్‌ గ్రూప్‌’ అంచనా వేసింది. ఉక్రెయిన్‌ పై యుద్ధం నేపథ్యంలో రష్యా బిలియనీర్లు ఇతర దేశాలకు తరలిపోతున్నారు. అదే సమయంలో చైనా బిలియనీర్లు కూడా ఇక్కడ డబ్బు సంపాదించి అమెరికా, లేదా యూరోప్‌ దేశాలకు వలస వెళ్లిపోతున్నారు.

Exit mobile version