Maharashtra: మనుషులను మాత్రమే కాదు. జంతువులను కూడా గౌరవించే సంప్రదాయం మనది. మన దేశంలో ఆవుల్ని కూడా పూజిస్తాం. పాములు, శునకాలు మొదలైన జంతువులకి ఆహారాన్ని పెడుతూ ఉంటాము. కోతులను మన దేశం వారు ఆంజనేయుడి స్వరూపంగా భావిస్తూ, పూజిస్తాం. మన సాంప్రదాయాలు చాలా గొప్పవి. మనుషులను గౌరవించినట్టు జంతువులను కూడా గౌరవిస్తుంటాం. అందుకు దయతో కూడిన హృదయం కూడా ఉండాలి. మంచి మనసు ఉండాలి. ఇవన్నీ మన దేశం వారికి ఉన్నాయి కాబట్టి మనం ఇలాంటి మంచి పనులు చేస్తూ, ప్రపంచ దేశాలన్నింటికి ఆదర్శంగా నిలుస్తున్నాం.
ఆ ఊర్లో కోతులకు దక్కిన గౌరవం..
ఈ గౌరవం ఏంటో తెలుసుకుంటే మీరు కూడా షాక్ అవుతారు. ఏకంగా 32 ఎకరాలను కోతుల పేరిట రాయడం విచిత్రంగా ఉంది కదా. కానీ ఇది నిజమండి, మహారాష్ట్రలో ఇలా జరిగింది. అక్షరాల 32 ఎకరాల భూమిని కోతుల పేరిట రిజిష్టర్ చేశారు. వినడానికి చాలా వింతగా ఉంది కదా. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. భూ తగాదాలు వస్తూ ఉండటం వల్ల ఆ సందర్భంలో మహారాష్ట్ర. ఉస్మానాబాద్ జిల్లాలోని ఓ గ్రామంలో 32 ఎకరాల భూమిని కోతుల పేరిట రిజిస్టర్ చేశారు.ఇంత గౌరవం అక్కడ కోతులకు దక్కింది.
కోతుల పేరిట భూమి..
మన దేశంలో నివసిస్తున్న వాళ్ళలో మందికి చిన్న ఇల్లు కట్టుకోవడానికే స్థలం లేదు. అలాంటిది ఆ కోతులకు 32 ఎకరాల భూమికి యజమానులుగా మారడం ఆసక్తికరమే. ఆ స్థలంలో అనేక చెట్లు ఉన్నాయి. వాటిపై ఆ కోతులు గెంతుతూ హాయిగా జీవిస్తున్నాయి.