Site icon Prime9

Megastar Chiranjeevi : త్రిషకు మద్ధతుగా మెగాస్టార్ చిరంజీవి.. కఠినంగా శిక్షించాలి అంటూ

chiranjeevi tweet about Mansoor Ali Khann comments about trisha

chiranjeevi tweet about Mansoor Ali Khann comments about trisha

Megastar Chiranjeevi : తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు చాలా వైరల్ అయ్యాయి. ఆ ఇంటర్వ్యూ లో ఆయన ఇలా అన్నాడు “చాలా సినిమాల్లో చాలా మంది హీరోయిన్స్ తో రేప్ సీన్స్ చేశాను. ఆ సీన్స్ లో నేను ఎంజాయ్ చేశాను. లియో సినిమాలో నన్ను సెలెక్ట్ చేసినప్పుడు త్రిషతో రేప్ సీన్ ఉంటుంది అనుకున్నాను. కానీ లేనందుకు బాధపడ్డాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఈ వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో సంచలనంగా మారాయి.

మన్సూర్ చేసిన వ్యాఖ్యలపై త్రిష తీవ్రంగా స్పందిస్తూ.. దీనిని త్రీవ్రంగా ఖండిస్తున్నాను. మహిళలని ద్వేషిస్తున్నట్టు ఈ వ్యాఖ్యలు ఉన్నాయి. ఇలాంటి వాళ్ళతో కలిసి నాకు సినిమాలో సీన్స్ లేనందుకు నేను సంతోషిస్తున్నాను. నా తర్వాత సినిమాల్లో కూడా ఇతనితో కలిసి నటించకుండా ఉండేలా చూసుకుంటాను అని ట్వీట్ చేసింది. ఇక త్రిషకు సపోర్ట్ గా లియో దర్శకుడు లోకేష్ కానగరాజ్, దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు, మాళవిక, చిన్మయి, నితిన్.. ఇలా చాలా మంది ప్రముఖులు, నెటిజన్లు, అభిమానులు ట్వీట్స్ చేస్తూ మన్సూర్ పై విమర్శలు చేస్తున్నారు.

తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా త్రిషపై మన్సూర్ చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ ట్వీట్ చేశారు. చిరంజీవి ( Megastar Chiranjeevi) తన ట్వీట్ లో.. త్రిష గురించి నటుడు మన్సూర్ అలీఖాన్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు నా దృష్టికి వచ్చాయి. తన వ్యాఖ్యలు వినడానికి అసహ్యం గా ఉన్నాయి . ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాలి. వక్రబుద్ధితో ఇలాంటివి మాట్లాడుతున్నారు. త్రిషకు మాత్రమే కాదు, ఇలాంటి వ్యాఖ్యలు ఏ అమ్మాయికి వచ్చినా నేను అండగా, సపోర్ట్ గా నిలబడతాను అని ట్వీట్ చేశారు. చిరంజీవి, త్రిష స్టాలిన్ సినిమాలో కలిసి నటించిన సంగతి తెలిసిందే.

ఏకంగా మెగాస్టార్ చిరంజీవి త్రిష అంశంపై స్పందించడంతో ఈ వివాదం మరింత పెద్దగా మారింది. ఇప్పటికే మన్సూర్ అలీఖాన్ పై తీవ్ర చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నారు. అయితే దీనిపై మన్సూర్ కూడా స్పందిస్తూ తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశాడు.

మన్సూర్ త్రిష వివాదంపై స్పందిస్తూ.. ఈ వీడియో గురించి నా ఫ్యామిలీ ద్వారానే విన్నాను. నేను పూర్తిగా మాట్లాడింది చూడకుండా అక్కడి వరకు మాత్రమే కట్ చేసి యూట్యూబ్ లో, సోషల్ మీడియాలో వైరల్ చేశారు. నాకు కూడా కూతుళ్లు ఉన్నారు. నా కూతురు లియో సినిమా ఓపెనింగ్ కి వచ్చి త్రిషతో మాట్లాడింది. నాపై కావాలనే కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు. నేను ఎన్ని సేవ కార్యక్రమాలు చేశానో, నేను ఎలాంటివాడినో తమిళ ప్రజలకు తెలుసు. నా గురించి ప్రశ్నించనవసర్లేదు అని సమాధానమిచ్చారు. మరి ఈ వివాదం ఇంకెక్కడివరకు వెళ్తుందో చూడాలి.

Exit mobile version