Site icon Prime9

MBA Chai Wala: MBA చాయ్‌వాలా రూ. 90 లక్షల కారు కొన్నాడు..

MBA Chai Wala’

MBA Chai Wala’

MBA Chai Wala:  ఎంబీఏ  చాయ్‌వాలా’గా పాపులర్ అయిన ప్రపుల్ బిల్లోర్ తాజాగా మరోసారి వార్తల్లో కెక్కాడు. అతను రూ. 90 లక్షల విలువైన కొత్త లగ్జరీ మెర్సిడెస్ బెంజ్ ఎస్‌యూవీని కొనుగోలు చేసి వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు.

100కు పైగా టీ స్టాల్స్ నిర్వహిస్తున్న ప్రపుల్ బిల్లోర్ ..(Chai Wala)

ప్రపుల్ బిల్లోర్ MBA డ్రాపౌట్ అయిన తరువాత 2017 నుంచి IIM-అహ్మదాబాద్ వెలుపల టీ స్టాల్ నడుపుతున్నాడు. అతను MBA చాయ్ వాలా బ్రాండ్ క్రింద  100 కు పైగా ఫుడ్ స్టాల్స్  నిర్వహిస్తున్నాడు. అంతేకాదు తన స్ఫూర్తిదాయకమైన కథతో యువకులకు మార్గనిర్దేశం చేసే వక్త గా కూడా మారాడు. అతనికి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో 1.5 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.

తన మిత్రుడు వివేక్ బిల్లోర్‌తో కలిసి కారుతో పోజులిచ్చిన ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసుకున్నాడు. అతను క్యాప్షన్‌లో ఇలా వ్రాశాడు.మా సరికొత్త Mercedes GLE 300dలో మా సాహసోపేత స్ఫూర్తిని వెలికితీసి, స్టైల్ మరియు గ్రేస్‌తో రోడ్లను జయిస్తాం, ఇది కృషి మరియు స్ఫూర్తి శక్తికి నిదర్శనం. జీవితాంతం నిలిచిపోయే జ్ఞాపకాలను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అతను తన కుటుంబ సభ్యులు మెర్సిడెస్ ఎస్ యు వి తో పోజులిచ్చిన చిత్రాలను కూడా పంచుకున్నాడు

 

దీనిపై నెటిజన్లు స్పందించారు. మిమ్మల్ని చూసి నేను ప్రేరణ పొందాను, అభినందనలు అనిఇన్‌స్టాగ్రామ్ రీల్‌కు సమాధానంగా వ్రాసారు, ఇది ఇప్పుడు వైరల్‌గా మారింది. మూడు రోజుల క్రితం ఆన్‌లైన్‌లో షేర్ చేయబడినప్పటి నుండి, కారు వీడియో రెండు మిలియన్లకు పైగా వ్యూస్ ను  మరియు వేల సంఖ్యలో లైక్‌లను  పొందింది.

ఇవి కూడా చదవండి:

 

Exit mobile version
Skip to toolbar