Mandous Effect : మాండూస్ ఎఫెక్ట్… నెల్లూరు, కాకినాడ జిల్లాల్లో మొదలైన వర్షాలు !

Mandous Effect : మాండూస్ తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్ లో మొదలైంది. ఈరోజు అర్థరాత్రి దాటిన తరువాత మహాబలిపురం వద్ద ఈ తుఫాను తీరం దాటే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. దీంతో

  • Written By:
  • Publish Date - December 9, 2022 / 11:37 AM IST

Mandous Effect : మాండూస్ తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్ లో మొదలైంది. ఈరోజు అర్థరాత్రి దాటిన తరువాత మహాబలిపురం వద్ద ఈ తుఫాను తీరం దాటే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో నేడు, రేపు భారీ వర్షాలు కురువనున్నాయి. ఈ తరుణంలోనే నెల్లూరు, కాకినాడ జిల్లాల్లో ఒక మోస్తరు వర్షం కురుస్తుంది. దీంతో అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. కాగా ఇప్పటికే ఆయా జిల్లాలో అధికారులు పలు సహాయక చర్యలు చేపట్టగా… తుఫాను రక్షణ, సహాయర చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎపిడిఆర్‌ఎఫ్‌ బృందాలు రంగం లోకి దిగాయి.

నెల్లూరు జిల్లా : ఈ జిల్లాలో మాండూస్ తుఫాను ఈరోజు మధ్యాహ్నం సమయానికి తీరం దాటె అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో ఇప్పటికే – జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరుగా వర్షం కురుస్తుంది. తీర ప్రాంతాల్లో సముద్రం ముందుకు రాగా… తీరం కొంత మేర కోత కు గురైంది. తుఫాను ఎఫెక్ట్ తో భారీగా చలిగాలులు వీస్తుండగా… పెద్ద ఎత్తున అలలు ఎగసిపడుతున్నాయి. ఈ తరుణంలోనే నిన్న రాత్రి నుంచి చలి తీవ్రత పెరగడంతో జిల్లా వాసులు వణుకుతున్నారని తెలుస్తుంది. ఇప్పటికే జిల్లాలో అప్రమత్తమైన అధికారులు, పాఠశాలలకి మధ్యాహ్నం సెలవు ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే మంత్రి కాకాణి అధికారులతో అత్యవసరంగా సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం అందుతుంది.

కాకినాడ జిల్లా : మాండూస్ తుఫాన్ ప్రభావంతో కాకినాడ జిల్లా అంతటా వాతావరణం మారినట్లు కనిపిస్తుంది. చలి గాలుల తీవ్రత పెరగడంతో ఆకాశం మేఘావృతంగా కనిపిస్తుంది. దీంతో పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తుంది. ఉప్పాడ సముద్రం తీరంలో ఉవ్వెత్తున కెరటాలు ఎగసి పడుతుండడంతో సముద్రతీరం వైపు వెళ్తున్న వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఉప్పాడ వైపు రాకపోకలను ప్రభుత్వ యంత్రాంగం నిలిపివేసింది. మరోవైపు ధాన్యం అమ్మకాలు ఇంకా పూర్తి కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట పొలాల్లో నుంచి కోసిన ధాన్యాన్ని ఎక్కడికక్కడ రోడ్లపై ఆరబెట్టడంతో ఈ తుఫాన్ కారణంగా వర్షాలు పడితే ధాన్యం తడిసిపోతుందని రైతుల్లో విషాదం అలుముకుంది.