Site icon Prime9

Under Cover Operation : డ్యూటీ కోసం స్టూడెంట్ గా మారిన పోలీస్… అండర్ కవర్ ఆపరేషన్ సక్సెస్ అయ్యిందా !

lady-constable-successfully-completed-under-cover-operation-in-madhyapradesh

lady-constable-successfully-completed-under-cover-operation-in-madhyapradesh

Under Cover Operation : సినిమాల్లో ఏదైనా కేసును చేధించడానికి అండర్ కవర్ ఆపరేషన్ చేసి వివరాలు అన్నీ సేకరించి విజయవంతంగా ఆ మిషన్ ని పూర్తి చేసి చివర్లో ఒక్కసారిగా నిందితులకు షాక్ ఇస్తుంటారు. ఇలాంటి ఘటనలను సాధారణంగా సినిమాల్లో మాత్రమే చూస్తూ ఉంటాం. నిజ జీవితంలో ఇలాంటి సంఘటనలను ఎదుర్కోవడం కష్టం అనే చెప్పొచ్చు. అయితే ఈ టైపు షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలల్లోకి వెళ్తే…

ఇండోర్ లోని ఎంజీఎం మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఆగడాలు ఎక్కువయ్యాయని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదులు చేశారు. సీనియర్లు తాము ఉండే ప్రాంతానికి పిలిచి మరీ అభ్యంతరకరంగా ర్యాగింగ్ చేస్తున్నారని… పోలీసు కేసు పెడితే తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయోనని భయపడి సైలెంట్ గా ఉండిపోయారు. కానీ వారి చర్యల్లో మార్పు లేకపోవడంతో తమ పేరు బయటకు రాకుండా ర్యాగింగ్ వివరాలను, గూగుల్ మ్యాప్ లొకేషన్ లను పోలీసులకు పంపించి చర్యలు తీసుకోవాలని విద్యార్ధులు ప్రాధేయపడ్డారు. కేసుకు సంబంధించి సరైన ఆధారాలు లేకపోవడంతో 5 నెలలుగా ఆ కేసులో పురోగతి లేకుండా ఉంది. అలాంటి సమయంలోనే ఓ మహిళా కానిస్టేబుల్ 3 నెలల పాటు విద్యార్ధిని లాగా ఆ కాలేజ్ లో ఉండి నిందితులు పదకొండు మంది సీనియర్ స్టూడెంట్లకు వ్యతిరేకంగా సాక్ష్యాలు సంపాదించి, ఉన్నతాధికారులకు అందించి శభాష్ అనిపించుకుంది.

ఈ కేసును ఛేదించడానికి పోలీసులు అండర్ కవర్ ఆపరేషన్ చేపట్టారు. అందుకోసం కాలేజీలో కొత్తగా జాయిన్ అయిన షాలిని చౌహాన్, సంజయ్, రింకూలతో పాటు మరికొందరిని ఉన్నతాధికారులు ఈ ఆపరేషన్ కు ఎంపిక చేశారు. ఇందులో భాగంగా 24 ఏళ్ల మహిళా కానిస్టేబుల్ షాలిని నర్సింగ్ స్టూడెంట్ గా నటించాల్సి వచ్చింది. దాదాపు మూడు నెలల పాటు డిపార్ట్ మెంట్ లో, ఎంజీఎం క్యాంపస్ లో, క్యాంటీన్ లో స్టూడెంట్ లానే గడుపుతూ విద్యార్థులతో మాట్లాడుతూ ఉండేది. మాట్లాడింది. అనుమానితులు అయిన 11 మంది సీనియర్ స్టూడెంట్ల కదలికలను ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ మిగతా వాళ్లు అందించే సమాచారంతో, నెట్ లో సేకరించిన సమాచారం కలిపి ఆధారాలను సేకరించింది. స్టూడెంట్లను ర్యాగింగ్ చేయడానికి వాట్సాప్ లలో తాము ఉండే రూమ్ లొకేషన్ పంపి, అక్కడికి రావాలని సీనియర్లు బెదిరించేవారు. ఇలా కేసుకు తగిన ఆధారాలను సేకరించిన తర్వాత అధికారులకు సమాచారం అందించింది.

 

ఈ వాట్సాప్ సంభాషణల స్క్రీన్ షాట్లు, గూగుల్ లొకేషన్ తదితర వివరాల ఆధారంగా ఆ పదకొండు మందికి పోలీసులు నోటీసులు పంపించారు. స్టేషన్ కు వచ్చి విచారణకు సహకరించాలని అందులో సూచించారు. వాళ్లను విచారిస్తే మరింతమంది స్టూడెంట్ల వివరాలు బయటపడొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఆ మూడు నెలల కాలంలో ఏ ఒక్కరికీ కూడా అనుమానం రాకుండా చాకచక్యంగా పని పూర్తి చేసిన షాలినిని ఉన్నతాధికారులు అభినందిస్తున్నారు.

Exit mobile version