Site icon Prime9

RRR : ఆర్ఆర్ఆర్ సినిమాని రెండుసార్లు చూసిన జేమ్స్ కామెరూన్.. రాజమౌళిని ఇచ్చిన ప్రశంస ఏంటంటే..

james cameron watched rrr movie two times and appreciate director rajamouli

james cameron watched rrr movie two times and appreciate director rajamouli

RRR : దిగ్గజ దర్శకుడు రాజమౌళి తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్నారు.

జక్కన్న ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన “ఆర్ఆర్ఆర్” లో రామ్ చరణ్ తేజ్, ఎన్టీఆర్ కలిసి నటించారు.

ప్రస్తుతం విదేశాల్లో ఉన్న జక్కన్న ఈ మూవీకి సంబంధించి పలు అవార్డు వేడుకల్లో పాల్గొంటూ బిజీగా ఉన్నారు.

ఇటీవలే రాజమౌళి ప్రపంచంలోనే టాప్ డైరెక్టర్స్ లో ఒకరైన స్టీవెన్ స్పిల్ బర్గ్ ని కలిశారు.

ఆయన్ని కలిసిన రాజమౌళి ఆ ఫోటోని షేర్ చేస్తూ నా దేవుడ్ని కలిశారని పోస్ట్ చేశారు.

స్టీవెన్ స్పిల్ బర్గ్ కి ఆర్ఆర్ఆర్ సినిమా, నాటు నాటు సాంగ్ నచ్చాయని చెప్పారన్నారు. దీంతో వీరిద్దరి ఫోటో వైరల్ గా మారింది.

తాజాగా ప్రపంచంలో మరో టాప్ డైరెక్టర్ అయిన జేమ్స్ కామెరూన్ ని రాజమౌళి కలిశారు.

ఆర్ఆర్ఆర్ (RRR) గురించి జేమ్స్ కామెరూన్ ఏమన్నారంటే..?

జేమ్స్ కామెరూన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవరసం లేదు.

ప్రపంచ సినిమా రంగం లోనే బెస్ట్ ఫిల్మ్ మేకర్ లలో ఒకరిగా ఎంతో గుర్తింపు పొందారు జేమ్స్ కామెరూన్.

టెర్మినేటర్, ర్యాంబో, టైటానిక్, అవతార్ లాంటి లార్జర్ దెన్ లైఫ్ సినిమాలని చెయ్యడంలో జేమ్స్ దిట్ట అని చెప్పాలి.

టైటానిక్ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన జెమ్స్.. అవతార్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు.

అలాగే ఇప్పుడు అవతార్ 2తో మరో సెన్సేషనల్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు.

ఆ విషయాన్ని తెలుపుతూ.. ట్వీట్ చేశారు రాజమౌళి. గ్రేట్ జేమ్స్ కామెరాన్ ఆర్ఆర్ఆర్ ను చూశారు. సినిమా ఆయనకు ఎంతో నచ్చడమే కాకుండా, ఆ సినిమాను వీక్షించాలంటూ భార్య సుజీకి సూచించి, ఆయన కూడా ఆమెతో కలిసి మరోసారి చూశారు. మీతో 10 నిముషాలు మాట్లాడుతూ మా సినిమా గురించి అనలైజ్ చేయడం నమ్మలేకపోతున్నాను. నన్ను వరల్డ్ లో టాప్ అన్నందుకు థ్యాంక్ యు సర్ అని పోస్ట్ చేశారు.‘నేనిప్పుడు చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. మీ ఇద్దరికీ ధన్యవాదాలు’’ అంటూ ట్వీట్ చేశారు జక్కన్న.

 

 

కీరవాణి పోస్ట్.. సముద్రమంత ఆనందం అంటూ

అలాగే కీరవాణి కూడా జేమ్స్ కామెరూన్ తో ఉన్న ఫోటోని షేర్ చేసి.. ఆర్ఆర్ఆర్ సినిమాని చూసి నా మ్యూజిక్ కూడా నచ్చిందని చెప్పారు. సముద్రమంత ఆనందంగా ఉంది అని పోస్ట్ చేశారు. ఇదే ఊపులో ఆర్ఆర్ఆర్ కి ఆస్కార్ రావాలని అంతా కోరుకుంటున్నారు.

ఇక్కడ చెప్పుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే ఆర్ఆర్ఆర్ సినిమా బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ కేటగిరిలో అవతార్ వే ఆఫ్ వాటర్ సినిమాకి టఫ్ కాంపిటీషన్ ఇచ్చి క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్ ఈవెంట్ లో రన్నర్ గా నిలిచింది.

బాహుబలి సినిమాతోనే తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా ఎలుగెత్తి చాటారు రాజమౌళి.

ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో టాలీవుడ్ సత్తా ఏంటో అందరికి మరోసారి తెలిసేలా చేశారు.

ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అనిపిస్తుంది.

ఇప్పటికే ఎన్నో అంతర్జాతీయ అవార్డులను కైవసం చేసుకున్న ఈ చిత్రం.. ఎన్నో రికార్డులను కొల్లగొట్టింది.

Exit mobile version