IT Rides Again: హైదరాబాద్ లో ఐటీ రైడ్స్ మరోసారి కలకలం రేపుతున్నాయి. ఈ సారి దాదాపు 30 టీమ్ లు ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నాయి. ఇటీవల వరుసగా హైదరాబాద్ లో సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మరోసారి ఈ దాడుల నేపథ్యంలో ప్రముఖులు అప్రమత్తం అవుతున్నారు.
ఉన్నట్టుండి ఐటీ అధికారులు భారీ స్థాయిలో దాడులు నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్ లోని ప్రముఖులే లక్ష్యంగా ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
పేరుమోసిన వ్యాపరవేత్త కార్యాలయాల్లో ఉదయం నుంచి ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.
హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 లో ఈ దాడులు జరుగుతున్నాయి.
హైదరాబాద్ తోపాటు ఇతర జిల్లాల్లో సైతం ఈ దాడులు కొనసాగుతున్నాయి.
ప్రముఖుల ఇళ్లల్లో సోదాలు
ప్రముఖులకు చెందిన రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ కార్యాలయాల్లో సోదాలు చేపట్టారు.
హైదరాబాద్ లోని ఆదిత్య హోమ్స్, ఊర్జిత కన్స్ట్రక్షన్స్ , సీఎస్ కె బిల్డర్స్ కార్యాలయంలో సోదాలు జరుగుతున్నాయి.
శ్రీ ఆదిత్య హోమ్స్ మేనేజింగ్ డైరెక్టర్ కోటారెడ్డి.. అతని కుమారుడి ఇళ్లు, కార్యాలయాల్లో అధికారులు సోదాలు జరుపుతున్నారు.
అలాగే ఊర్జిత కన్స్ట్రక్షన్స్ శ్రీనివాస్ రెడ్డి.. మాధవరెడ్డి, వీర ప్రకాష్ ఇళ్లు, కార్యాలయాల్లో ఈ దాడులు కొనసాగుతున్నాయి.
ఆదాయపు పన్నుల్లో అవకతవకలకు పాల్పడినట్లు ఆదాయపు పన్ను అధికారులు గుర్తించారు.
ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారనే ఆరోపణలతో సోదాలు చేస్తున్నట్లు సమాచారం.
ఎక్సెల్ గ్రూపు కంపెనీలలోని ఆరుగురు డైరెక్టర్లు, సీఈవో నివాసాల్లో ఐటీ అధికారులు సోదాలు చేసిన విషయం తెలిసిందే.
ఎక్సెల్ గ్రూపునకు అనుబంధంగా ఉన్న కంపెనీల్లో కూడా సోదాలు జరిగాయి.
సంగారెడ్డి జిల్లాలోని నాలుగు కంపెనీల్లో భారీ తేడాతో అక్రమాలు జరిగాయని అధికారులు గుర్తించారు.
నార్సింగిలో ఆరు చోట్ల.. దుండిగల్‌లోని నాలుగు కంపెనీల్లో సోదాలు నిర్వహించారు.
లండన్ నుంచి ఎక్సెల్ కంపెనీ 500 కోట్లు పెట్టుబడులు పెట్టినట్లు ఐటీ శాఖ గుర్తించింది.
ఈ పూర్తి లెక్కలపై ఐటీ అధికారులు ఆరా తీశారు. ఈ సోదాల్లో ఎలాంటి రాజకీయ కక్ష లేదని తెలుస్తోంది.
కంపెనీలు తమ ఆదాయానికి అనుగుణంగా పన్నులు చెల్లిస్తున్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తుంది.
విచారణ అనంతరం తేడాలు ఉంటే.. చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
ఆదాయపు పన్ను ఎగవేసినట్లు నిర్దారణ అయితే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలుపుతున్నారు.
ఇక ఈ దాడులతో ఇతర కంపెనీ సీఈఓలు, డైరెక్టర్లు, ఇతరులు ఆందోళనకు గురవుతున్నారు.
ఈ దాడులు ఇంకా కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇందులో ఎలాంటి రాజకీయ కక్ష లేదని సమాచారం.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/