Site icon Prime9

Sania Mirza & Shoaib Malik’s breakup: సానియామీర్జా, షోయబ్ మాలిక్ విడిపోవడానికి ఈ పాకిస్తానీ మోడల్ కారణమా?

breakup

breakup

Sania Mirza & Shoaib Malik: సానియా మీర్జా మరియు షోయబ్ మాలిక్ విడిపోయారనే వార్తల మధ్య, ఆయేషా ఒమర్ అనే పాకిస్థాన్ నటి చర్చనీయాంశంగా మారింది. ఈ సెలబ్రిటీ కపుల్ విడాకుల వైపు వెళుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో పాకిస్తాన్ మోడల్‌తో షోయబ్ ఎఫైర్‌తో సోషల్ మీడియా హోరెత్తుతోంది. పాకిస్థానీ మోడల్‌తో షోయబ్‌కు సన్నిహితంగా ఉండటంపై దంపతుల మధ్య విభేదాలు తలెత్తాయని సమాచారం.షోయబ్ మరియు అయేషా ఒక టెలివిజన్ షోలో పనిచేస్తున్నప్పుడు స్నేహపూర్వక సంబంధాలను పెంచుకున్నారని తరువాత మరింత సన్నిహితంగా మారారని పాక్ మీడియా నివేదించింది. సానియా-షోయబ్ విడాకులకు పాక్ మోడల్ అయేషా ఒమర్ కారణమని ఇంటర్నెట్‌లో పాపులర్ టాక్.

అయేషా ఒమర్ ఎవరు?

అయేషా ఒమర్ ఒక ప్రసిద్ధ పాకిస్థానీ మోడల్, నటి మరియు యూట్యూబర్. ఆమె పాకిస్తాన్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో కూడా ఒకరు.షోయబ్ మాలిక్ గతేడాది మోడల్‌తో ఫోటోషూట్ చేశాడు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన షోయబ్ బోల్డ్ ఫోటోషూట్ చేయడంలో అయేషా తనకు చాలా సాయం చేసిందని చెప్పాడు . సానియా, షోయబ్ ఇద్దరూ కొంతకాలంగా విడివిడిగా జీవిస్తున్నారని, సయోధ్యకు అవకాశం లేదని ఈ జంట సన్నిహితులు ఇటీవల వెల్లడించారు. గత సంవత్సరం దుబాయ్‌లో తమ కుమారుడు ఇజాన్ మీర్జా మాలిక్ పుట్టినరోజును ఇద్దరూ కలిసి చేసారు. సానియా ప్రస్తుతం దుబాయ్‌లో ఉండగా, మాలిక్ పాకిస్థాన్‌లో ఉన్నారు, T20 వరల్డ్ కప్ 2022 సమయంలో A స్పోర్ట్స్ కోసం నిపుణుడిగా పని చేస్తున్నారు.

సానియా మీర్జా, షోయబ్ మాలిక్ అధికారికంగా విడాకులు తీసుకోబోతున్నారని ఆ జంట సన్నిహితులు ధృవీకరించారు. ఈ జంట ఇప్పటికే విడిపోవాలని నిర్ణయించుకున్నారని మరియు వ్రాతపని ఫార్మాలిటీలు మాత్రమే మిగిలి ఉన్నాయని వారి సన్నిహితులలో ఒకరు వెల్లడించారు.

Exit mobile version