Site icon Prime9

Oscar Awards: ఆస్కార్ కు ఆర్ఆర్ఆర్ తో పాటు భారత్ నుంచి మరో రెండు డాక్యుమెంటరీలు నామినేట్.. ఏవంటే?

indian movies details nominated for 95th oscar awards

indian movies details nominated for 95th oscar awards

Oscar Awards: సినిమాలకు సంబంధించి అత్యుత్తమ పురస్కారం అంటే ముక్త కంఠంతో చెప్పే మాట ఆస్కార్. ఈ అవార్డు కోసం ప్రతి సినిమా వాళ్ళు కలలు కంటారు. ఈ అవార్డు నామినేషన్స్ కి ఇండియా నుంచి సినిమాలు వెళ్లడం చాలా అరుదు. ఇప్పటిదాకా మనకి వచ్చిన ఆస్కార్ అవార్డులు చాలా తక్కువే. అయితే  ఈ సంవత్సరం ఆస్కార్ అవార్డుల గురించి భారతీయులు అందరూ ఎదురు చూస్తున్నారు. అందుకు కారణం ఆర్ఆర్ఆర్ సినిమా అని చెప్పాలి. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తూ ఆర్ఆర్ఆర్ సినిమా పలు అంతర్జాతీయ అవార్డులను  దక్కించుకుంది.     

ఇటీవల ఆర్ఆర్ఆర్  గోల్డెన్ గ్లోబ్ కూడా గెలుచుకొని ఆస్కార్ అవార్డులపై మరింత ఆసక్తి పెరిగేలా చేసింది. అయితే అందరూ ఆశించినట్లుగానే “బెస్ట్ ఒరిజినల్ సాంగ్” కేటగిరీలో ఆస్కార్ నామినేట్ అయింది.

కానీ బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్ కేటగిరీలో ‘ఆర్ఆర్ఆర్’ మూవీకి నిరాశే ఎదురైంది.

అయితే ఇండియా నుంచి మరో రెండు సినిమాలు ‘ఆల్ దట్ బ్రీత్స్’, ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ డాక్యుమెంటరీలు రెండు వేర్వేరు విభాగాల్లో ఆస్కార్ కోసం నామినేట్ అయ్యాయి.

ఆల్ దట్ బ్రీత్స్.. 

ఈ మేరకు 95వ అకాడమీ అవార్డ్స్‌లో ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ కోసం ఆల్ దట్ బ్రీత్స్ పోటీపడుతుంది.

షౌనక్ సేన్ దర్శకత్వం వహించిన ఆల్ దట్ బ్రీత్స్.. గాయపడిన పక్షులను రక్షించి, వాటికి చికిత్సనందించే సిబ్లింగ్స్ మొహమ్మద్ సౌద్, నదీమ్ షెహజాద్‌ కథ ఆధారంగా తెరకెక్కింది. ఈ కథ అభివృద్ధి చెందుతున్న నగరంతో పాటు ఇద్దరు సోదరుల బంధం చుట్టూ తిరుగుతుంది.

దీనికి పోటీగా ఇదే కేటగిరీ కింద ‘ఆల్ ది బ్యూటీ అండ్ ది బ్లడ్‌షెడ్, ఫైర్ ఆఫ్ లవ్, ఎ హౌస్ మేడ్ ఆఫ్ స్ప్లింటర్స్, నావల్నీ’ చిత్రాలు నామినేట్ చేయబడ్డాయి.

95వ అకాడమీ అవార్డుల కోసం డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో 144 చిత్రాలు అర్హత సాధించగా.. 15 చిత్రాల షార్ట్‌లిస్ట్‌లో ఆల్ దట్ బ్రీత్స్ చోటు దక్కించుకుంది. అయితే ఈ డాక్యుమెంటరీ ఇంతకుముందే కేన్స్ 2022 వేడుకల్లో L’Oel d అవార్డ్ గెలుచుకుంది.

ది ఎలిఫెంట్ విస్పరర్స్.. 

ఇక ది ఎలిఫెంట్ విస్పరర్స్  ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కోసం నామినేట్ చేయబడింది.

ఈ చిత్రానికి కార్తికి గొన్సాల్వేస్ దర్శకత్వం వహించారు.

ప్రకృతికి సంబంధించిన కథాంశంతో రూపొందిన ఈ డాక్యుమెంటరీ నెట్‌ఫ్లిక్స్‌లో వీక్షించేందుకు అందుబాటులో ఉంది.

తమిళనాడులోని మధుమలై టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో రెండు అనాథలైన బేబీ ఎలిఫెంట్స్‌ను దత్తతకు తీసుకున్న ఒక ఫ్యామిలీ నేపథ్యంలో ఉంటుంది.

ఆస్కార్ నామినేషన్లను ఈ రోజు నటులు అలిసన్ విలియమ్స్, రిజ్ అహ్మద్ ప్రకటించారు.

ఈ వేడుకకు జిమ్మీ కిమ్మెల్ మూడోసారి హోస్ట్‌గా వ్యవహరించనున్నారు.

మార్చి 12న లాస్ ఏంజెల్స్‌లో 95వ అకాడమీ అవార్డుల వేడుక జరగనుంది.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version