Site icon Prime9

Viral Video: ఇదేం ఏనుగు అండి బాబు.. పానీపూరీలు ఇలా లాగించేస్తుంది!

elephant prime9news

elephant prime9news

Assam: ప్రస్తుత రోజుల్లో మనుషులతో పాటు జంతువులకు కూడా అభిరుచులు మారుతున్నాయి. ఈ మధ్య సోషల్ మీడియాలో కోతి ఐస్ క్రీం తిన్న వీడియో, కుక్క డ్రింక్ తాగిన వీడియో తెగ వైరల్ అయ్యాయి. తాజాగా అలాంటి వీడియోనే సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. ఏనుగు పానీపూరి తిన్న వీడియో ఇప్పుడు ట్విట్టర్లో ఒక రేంజులో ట్రెండ్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం మాతో పాటు మీరు కూడా ఓ లుక్కేయండి.

వీడియో ఓపెన్ చేస్తే, ఇందులో ఒక అతను ఏనుగును పానీపూరి బండి వద్దకు తీసుకొస్తాడు. ఆ బండి యజమాని పానీపూరీలను ఒకటి ఒకటిగా ఇస్తూ ఉంటే ఆ ఏనుగు భలేగా తింటుంది. ఏనుగు పానీపూరి తినడం చూసి అక్కడి ఉన్న స్థానికులంతా చూసి ఆశ్చర్యపోయారు. ఈ వింత ఘటన అసోంలోని తేజ్​పుర్​లో చోటుచేసుకుంది.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

ఇప్పటి వరకు మనం ఏనుగు చెరుకును తినడం చుశాం. కానీ ఇలా పానీపూరి తినడం ఏంటి భయ్యా అంటూ నెటిజన్లు కూడా షాక్ అవుతూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్స్ తమదైన రీతిలో ఏనుగు మీద కామెంట్లు వర్షం కురిపిస్తున్నారు. ఎంత చక్కగా పానీపూరీలు లాగించేస్తున్న ఈ ఏనుగు వీడియోకు ఒక రేంజులో లైక్స్ , కామెంట్స్ వస్తున్నాయి. అంతేకాదు చాలా మంది ఈ వీడియోను షేర్ కూడా చేస్తున్నారు.

 

Exit mobile version