Site icon Prime9

Google : గూగుల్ లో వీటిని సెర్చ్ చేస్తే ఇక జైలుకే..?

google

google

Google : ప్రస్తుత కాలంలో సాంకేతికత ఎంతో అభివృద్ది చెందింది. మారుతున్న కాలానుగుణంగా ప్రజలు కూడా అప్డేట్ అవుతూ వస్తున్నారు. చిన్నపిల్లల నుంచి పెద్ద వరకు అందరికీ గూగుల్ గురించి తెలుసు. మనం ఏదైనా తెలుసుకోవాలన్నా, దేని గురించి వెతకాలన్నా వెంటనే అందరం చేసే పని గూగుల్ లో సెర్చ్ చేయడం. అయితే గూగుల్ లో ఏది పడితే అది వెతికేయడం మంచిది కాదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇంటర్నెట్ ఉంది కదా అని గూగుల్ లో అన్ని వెతికేస్తే ఇక జైలుకే అని చెబుతున్నారు.

ముఖ్యంగా చట్టవ్యతిరేకమైన అంశాల గురించి గూగుల్ లో సెర్చ్ చేసినా… ఆయా అంశాలపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా పోలీసులు చర్యలు తీసుకోక తప్పదు. గూగుల్ లో సెర్చ్ చేయకూడనివి ఏంటంటే?

బాంబు ఎలా తయారు చేయాలి, ప్రెషర్ కుక్కర్ బాంబు ఎలా తయారు చేయాలనే అంశాలను సెర్చ్ చేయకూడదు. ఈ విధంగా ఇతరులకు ప్రమాదం కలిగించే విషయాల గురించి సెర్చ్ చేసినప్పుడు సెర్చింజన్ సిబ్బందికి, దర్యాప్తు ఏజెన్సీలకు సమాచారం వెళుతుంది. ఇది చట్టరీత్యా నేరం.

చైల్డ్ పోర్నోగ్రఫీ గురించి సెర్చ్ చేయడం, అందుకు సంబంధించిన కంటెంట్ చూడడం కూడా నేరం. ఇందుకు సంబంధించి ఇప్పటికే కొన్ని ఘటనలు జరిగాయి.

ఆయుధాన్ని ఎలా తయారు చేయాలి ? ఆయుధాలు ఎక్కడ లభిస్తాయి? ఏ ఆయుధాన్ని ఎలా ఉపయోగించాలి? బుల్లెట్లు ఎక్కడ లభిస్తాయి? వంటివి కూడా సెర్చ్ చేయకూడదు. ఇది చట్టరీత్యా నేరం.

అబార్షన్ కు సంబంధించి గూగుల్ లో వెదికినా ఇబ్బందికరమే. గర్భాన్ని తొలిగించుకోవడం ఎలా? అబార్షన్ టాబ్లెట్స్ లాంటివి సెర్చ్ చేయకూడదు. ఎందుకంటే, ఇవి ప్రాణాపాయం, వైద్యుల సలహా తప్పనిసరి. ఇది చట్టరీత్యా నేరం.

వీటితో పాటు పలు నేరాలకు సంబంధించిన పదాలు కూడా గూగుల్ లో సెర్చ్ చేయకూడదు. ‘గన్ ఆన్ లైన్’, ‘బాంబ్ మెటీరియల్’, ‘బ్లాస్ట్ చేయడం ఎలా’, ‘సైనైడ్ ఎక్కడ దొరుకుతుంది’ లాంటివి గూగుల్ లో సెర్చ్ చేయకూడదు. ఇది చట్టరీత్యా నేరం.

వీటన్నింటినీ నేరపూరితమైన సెర్చ్ కీ-వర్డ్స్ గా గూగుల్ నిర్థారించింది. గూగుల్ లో కనుక ఈ పదాలను సెర్చ్ చేస్తే వెంటనే మీ కంప్యూటర్, మొబైల్ ఐపీ ట్రాక్ అవుతుంది. కాబట్టి ఇకపై గూగుల్ లో ఏదైనా సెర్చ్ చేసే ముందు జాగ్రత్త పాటించడం ముఖ్యం.

Exit mobile version