Constable Leave Letter: భార్య అలిగింది సార్.. ఓ వారం రోజులు లీవ్ ఇవ్వండి అంటూ ఓ కానిస్టేబుల్ రాసిన లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీకు నవ్వొస్తుంది కదా.. ఇది నిజమేనండి.. భార్య కోసం ఓ కానిస్టేబుల్ పోలీస్ అధికారులకు రాసిన లేఖ ట్రెండింగ్ లో నడుస్తుంది. భార్య అలిగిందని ఏకంగా ఓ కానిస్టేబుల్ ఏఎస్పీకి లేఖ రాయడం వైరల్ అయింది. యూపీ లోని మహరాజ్ గంజ్ కి చెందిన కానిస్టేబుల్ గౌరవ్ చౌదరికి డిసెంబర్ లో వివాహమైంది.
ఎందుకు లీవ్ అడిగాడంటే?
కాగా.. భార్యను ఇంటి దగ్గరే వదిలి భర్త విధుల కోసం వెళ్లాడు. కొద్ది రోజులు బాగానే ఉన్నా.. భర్త ఇంటికి తిరిగి రాకపోవడంతో విసుగు చెందిన భార్య గౌరవ్ చౌదరి ఫోన్ చేసినా స్పందించలేదు. ఎన్నిసార్లు కాల్ చేసిన కట్ చేస్తుందని.. కానిస్టేబుల్ వాపోయాడు. వెంటనే తన భార్యను బుజ్జగించేందుకు వెళ్లాలని కోరాడు. అందుకోసం తనకు వారం సెలవులు మంజూరు చేయాలని ఆ కానిస్టేబుల్ ఏఎస్పీకి లేఖ రాశాడు. కానిస్టేబుల్ బాధను అర్ధం చేసుకున్న పోలీసులు అతడికి ఐదు రోజుల సెలవుకు అనుమతినిచ్చారు.
బాధను అర్ధం చేసుకున్న పోలీసులు
ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. ఏకంగా ఐదు రోజులు లీవ్ ఇవ్వడం. ఇంట్లో భార్య అలిగితే ఎలా ఉంటుందో పాపం ఆ పోలీసులకు కూడా అర్ధం అయింది. అందుకే ఐదు రోజులు సెలవు ఇచ్చారని సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. మరో వైపు భార్య అలకను తీర్చేందుకు కానిస్టేబుల్ లీవ్ అడగడం కూడా.. తనకు భార్యపై ఎంత ప్రేమ ఎంతుందో తెలుస్తుందని పలువురు అంటున్నారు. ఈ లెటర్ మాత్రం కొందరికి నవ్వు తెప్పిస్తుంటే.. మరి కొందరికి భార్యపై ప్రేమ ఎలా ఉండాలో చూపిస్తుందని కామెంట్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
బిగ్ సర్‌ప్రైజ్.. ఆస్కార్‌కు క్వాలిఫై అయిన “కాంతారా”
ఈ రోజుల్లో రాజకీయం చేయాలంటే 10 మంది పోరంబోకులు వెంట ఉండాలి.. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్
తక్కువ ధరలో మహీంద్రా థార్ సరికొత్త వేరియంట్ లాంచ్.. ఫీచర్స్ ఇవే..
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: http://Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/