Site icon Prime9

Waltair veerayya : బాక్సాఫీస్ ని ఊచకోత కోస్తున్న బాస్ వాల్తేరు వీరయ్య.. ఓవర్సీస్ లో రికార్డు కలెక్షన్స్

chiranjeevi waltair veerayya record collections in america

chiranjeevi waltair veerayya record collections in america

Waltair veerayya : మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో ‘వాల్తేరు వీరయ్య’ సినిమా రూపొందింది.

ఈ నెల 13వ తేదీన ఈ సినిమా థియేటర్లకు వచ్చింది.

పండగ నాడు పక్కా కమర్షియల్, మాస్, ఎమోషన్ ఎలిమెంట్స్ తో వచ్చి అభిమానులనే కాక ప్రేక్షకులని కూడా అలరిస్తుంది ఈ సినిమా.

తెలుగుతో పాటు హిందీలో కూడా వాల్తేరు వీరయ్య రిలీజ్ అయింది. అమెరికాలో 1200 స్క్రీన్స్ లో మూవీని రిలీజ్ చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో 1200 థియేటర్స్ లో సినిమా విడుదల అయింది.

శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో మాస్ మహరాజ్ రవితేజ ముఖ్యపాత్రలో కనిపించాడు.

దేవీశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా మైత్రీమూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది.

తొలి రోజునే భారీ ఓపెనింగ్స్ తో ఈ సినిమా తన బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

ప్రపంచవ్యాప్తంగా తొలి 3 రోజుల్లోనే ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లోకి చేరి భారీ విజయం సాధించింది.

ఇక ఇప్పటికే దాదాపు 150 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్టు సమాచారం.

అయితే మెగాస్టార్ మానియా ఇక్కడే కాదు అమెరికాలో కూడా బాగా వినిపిస్తుంది.

చిరంజీవి, రవితేజ కలిసి ఈ సినిమా చేయడంతో సినిమా ఇంకా పాపులర్ అయింది.

అమెరికాలో కూడా బాస్, మాస్ అభిమానులు ఈ సినిమాని బాగా ఎంజాయ్ చేస్తున్నారు.

అమెరికాలో రికార్డు కలెక్షన్స్ సాధించిన వాల్తేరు వీరయ్య (Waltair veerayya)..

సాధారణంగా అమెరికాలో 1 మిలియన్ డాలర్స్ సాధిస్తే చాలని అన్ని సినిమాలు అనుకుంటాయి.

కానీ ఈసారి మెగాస్టార్ రికార్డు సృష్టించారు. వారం రోజుల్లోపే అమెరికాలో 2 మిలియన్ డాలర్స్ గ్రాస్ కలెక్షన్స్ సాధించి అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది ఈ మూవీ.

అంటే దాదాపుగా 16 కోట్లకు పైగా కలెక్షన్స్ ని రెండు వారాల్లోపే కొల్లగొట్టడం కేవలం మెగాస్టార్ కే సాధ్యం అయ్యిందని ఫ్యాన్స్ అంతా ఖుషి అవుతున్నారు.

 

 

మెగాస్టార్ కెరీర్ లో అమెరికాలో 2 మిలియన్ డాలర్స్ సాధించిన మూడో సినిమా వాల్తేరు వీరయ్య కావడం విశేషం.

ఇప్పటికే చిరంజీవి సైరా నరసింహారెడ్డి, ఖైదీ సినిమాలు ఈ ఘనత సాధించాయి. ఈ కలెక్షన్స్ ఇంకా కొనసాగే అవకాశం ఉండడంతో చిరు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యంగా ఈ చిత్రంలో చిరంజీవి చెప్పే డైలాగ్స్, ఆయన వేసే స్టెప్పులకు అనూహ్య స్పందన వస్తోంది.

ముందే చెప్పినట్లుగా థియేటర్ లో అభిమానులకు పూనకాలు రప్పిస్తోంది.

చిరు స్టెప్పులకు ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. ఈ సినిమా చూశాకా 80, 90 దశకాల అభిమానులకి పాత చిరంజీవి గుర్తురావడం ఖాయం అని అభిమానులు అంటున్నారు.

మొత్తానికి పండక్కి చాలా రోజుల తర్వాత చిరంజీవి తన వింటేజ్ మాస్ లుక్, కామెడీ, యాక్షన్ తో వచ్చి అభిమానులనే కాక ప్రేక్షకులని కూడా అలరిస్తున్నాడు.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version