Site icon Prime9

Waltair Veerayya: “సుమ అడ్డా”లో మెగాస్టార్ చిరంజీవి.. వాల్తేరు వీరయ్య డైరెక్టర్‌తో?

chiranjeevi participated in suma new show with waltair veerayya director

chiranjeevi participated in suma new show with waltair veerayya director

Waltair Veerayya: మూడు దశాబ్దాలుగా మకుఠం లేని మహారాణిలా బుల్లి తెరను ఏలుతున్నారు స్టార్ యాంకర్ సుమ. ఈటీవీలో ప్రసారమైన ‘స్టార్ మహిళ’ ప్రోగ్రామ్‌తో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న సుమ.. ఆ తర్వాత వేర్వేరు చానెళ్లలో పలు షోలకు హోస్ట్ చేశారు.

టీవీ ఇండస్ట్రీలోకి ఎంత మంది కొత్త యాంకర్లు వచ్చినా సుమ స్థాయిని మాత్రం అందుకోలేకపోయారు. ఒకవైపు టీవీ షోలు.. మరోవైపు ప్రీరిలీజ్ ఈవెంట్లు చేస్తూనే సెలబ్రిటీలను ఇంటర్వ్యూలతో ఫుల్ బిజీగా ఉంటున్నారు సుమ.

తాజాగా సుమ మరో కొత్త షో మొదలుపెడుతున్నారు. అది కూడా ఈటీవీలోనే.

మల్లెమాల సంస్థ సుమతో నిర్మిస్తున్న కొత్త షో కు ‘సుమ అడ్డా’ అని పేరు పెట్టారు.

ఇందులో కొత్తేముంది అనుకుంటున్నారా? అయితే ఈ గేమ్ షోకు ఏకంగా మెగాస్టార్ చిరంజీవి గెస్ట్‌గా రానున్నారట.

ఇప్పటివరకు చిరంజీవి.. ఇలాంటి గేమ్‌షో లో ఎప్పుడూ కనపించలేదు.

మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ ఎప్పుడంటే..

మరి, మెగాస్టార్ బుల్లితెరపై ఎలా సందడి చేస్తారో చూసేందుకు ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అయితే దాని కోసం కొంత నిరీక్షణ తప్పదు.

ఎందుకంటే.. ఈ షోలో తొలి ఎపిసోడ్‌గా కల్యాణం కమనీయం మూవీ టీమ్‌ గెస్ట్‌లుగా వచ్చారు. వాళ్లతో సుమ తనదైన స్టైల్లో నవ్వులు పంచుతోంది.

ఈ మూవీ హీరో సంతోష్‌ శోభన్‌, హీరోయిన్‌ ప్రియా భవానీ శంకర్‌, డైరెక్టర్‌ అనిల్‌ కుమార్‌ ఆళ్ల.. సుమ అడ్డా తొలి ఎపిసోడ్‌లో సందడి చేశారు.

రెండో ఎపిసో‌డ్‌కు మెగాస్టార్ చిరంజీవి, డైరక్టర్ బాబీ గెస్ట్‌లుగా రానున్నారని టాక్.

మెగాస్టార్ చిరు ఒక టీవీ గేమ్ షోకి అతిథిగా హాజరుకావడం పెద్ద విషయమే.

గతంలో ఆహాలో సమంత టాక్ షోలో పాల్గొన్నారు.

చిరంజీవి మీలో ఎవరు కోటీశ్వరుడు షోను కూడా హోస్ట్ చేశారు. నాగార్జున ఈ షోను హోస్ట్ చేస్తున్నప్పుడు గెస్ట్‌గా కూడా హాజరయ్యారు.

కానీ, సుమ చేస్తున్న గేమ్ షోలో చిరు ఎలా సందడి చేస్తారో చూడాలని అభిమానులు తెగ వెయిట్ చేస్తున్నారు.

సంక్రాంతి సందర్భంగా ఈ ఎపిసోడ్ రానుందట.

మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది సంక్రాంతి బ‌రిలోకి ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) గా దూసుకొచ్చేస్తున్నారు.

ఈయ‌నకు తోడుగా మాస్ మ‌హారాజా ర‌వితేజ ఉండటంతో మెగా మాస్ పూన‌కాల కోసం అభిమానులు ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమా (Waltair Veerayya)ను సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 13న రిలీజ్ చేయ‌బోతున్నారు. సినిమా ప్రమోషనల్ యాక్టివిటీస్ శ‌ర‌వేగంగా జరుగుతున్నాయి.

 

ఇవి కూడా చదవండి:

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Exit mobile version