Site icon Prime9

Che Guevara : నేడు హైదరాబాద్‌కు చేగువేరా కూతురు, మనవరాలు… ఆ పార్టీ నేతలకు సభలో నో ఎంట్రీ

che guevara daughter and grand daughter coming to hyderabad

che guevara daughter and grand daughter coming to hyderabad

Che Guevara : విప్లప యోధుడు, క్యూబా మాజీ మంత్రి ఎర్నెస్టో చే గువేరా గురించి అందరికీ తెలిసిందే. అయితే చేగువేరా కుమార్తె డాక్టర్‌ అలైద గువేరా, మనవరాలు ప్రొఫెసర్‌ ఎస్తిఫినా గువేరా నేడు హైదరాబాద్‌కు రానున్నారు. ఈరోజు ( 22.01.2023 ) సాయంత్రం నాలుగు గంటలకు రవీంద్రభారతిలో జరిగే ‘క్యూబా సంఘీభావ సభలో అలైదా గువేరా, ఎస్తే ఫానియా ముఖ్య అతిధులుగా పాల్గొననున్నారు.

కాగా అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా క్యూబాకు చాలా దేశాలు మద్దతు ఇస్తున్నాయి.

అందులో భాగంగా క్యూబాకు మద్దతు తెలుపుతూ హైదరాబాద్‌లో నిర్వహించే సభకు చేగువేరా కూతురు, మనవరాలు వస్తున్నారు.

ఈ మేరకు ఇప్పటికే వారికి నేతలు ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ సభను విజయవంతం చేయాల్సిందిగా నేషనల్ కమిటీ ఫర్ సాలిడారిటీ విత్ క్యూబా తెలంగాణ కమిటీ కోఆర్డినేటర్లు బాలమల్లేష్, నరసింహరావు పిలుపునిచ్చారు.

అటు సభ జరిగే రవీంద్రభారతి వద్ద భారీగా ఫ్లెక్సీలు, కటౌట్‌లు వెలిశాయి.

చేగువేరా ఫ్లెక్సీలతో పాటు ఆయన కూతురు, మనవరాలిని స్వాగతిస్తూ పెద్దఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు

క్యూబా సంఘీభావ సభలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, వినోద్ కుమార్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శకులు కూనంనేని, తమ్మినేని, మాజీ ఎంపీ మల్లు రవి, పలు పార్టీలకు చెందిన నేతలు, ప్రజా సంఘాల సభ్యులు పాల్గొననున్నారు.

సభ నిర్వాహకులు బీజేపీ, ఎంఐఎం పార్టీలకు చెందిన వారికి తప్ప మిగతా వారిని ఆహ్వానించేందుకు నిర్ణయం తీసుకున్నారు.

ఈ పర్యటనలో భాగంగా అలైదా, ఎస్తేఫానియా సీపీఐ రాష్ట్ర కార్యాలయమైన మఖ్దూంభవన్‌కు వెళ్లనున్నారు. .

 

ఎర్నెస్టో చే గువేరా 1928 జూన్‌ 14న అర్జెంటీనాలోని రోజలియాలో జన్మించారు.

చే గువేరా లాటిన్ అమెరికాలోని వివిధ దేశాల్లో జరిగిన కమ్యూనిస్ట్ విప్లవాల్లో పాలుపంచుకున్నారు.

మార్క్సిస్ట్ విప్లవకారుడు గానే కాదు, వైద్యుడు, రచయిత, గెరిల్లా నాయకుడు, సైనిక వ్యూహకర్త, సిద్ధాంతకర్త, క్యూబన్ విప్లవంలో ప్రముఖ వ్యక్తి గానూ చే పాపులరయ్యారు.

గతంలో ఇండియాకు వచ్చిన చేగువేరా (Che Guevara)..

1959 జూన్‌ 30 వే తేదీన చే తొలిసారి భారతదేశం వచ్చారు.

ఆ రాత్రి పొద్దు పోయాక ఢిల్లీ పాలం విమానాశ్రయంలో దిగారు. మర్నాడు నాటి ప్రధాని నెహ్రూ తన అధికార నివాసం తీన్‌మూర్తి భవన్‌లో చేగువేరాను సాదరంగా ఆహ్వానించారు.

వలస పాలన నియంతృత్వాన్ని వ్యతిరేకించే ఆఫ్రో–ఏషియన్‌ దేశాలన్నీ బాండుంగ్‌లో సమావేశమై.. సమైక్యంగా ఉండాలని, ఆర్థికంగా సహాయ సహకారాలు ఇచ్చిపుచ్చుకోవాలని ఒప్పందం కుదుర్చుకున్నాయి.

అందులో ఇండియా కూడా ఉంది. అందుకే చేగువేరా ఇండియా వచ్చారు.

భారత్ వచ్చిన చేగువేరా ఇక్కడే కొన్ని రోజులు ఉన్నారు.. అప్పుడు కలకత్తా కూడా సందర్శించారు.

ప్రస్తుతం వీరి పర్యటన రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version