Site icon Prime9

Viral News : పెళ్లి కొడుకు ముక్కు చిన్నగా ఉందని మ్యారేజ్ కి నో చెప్పిన యువతి

bride cancel marriage for silly reason and news got viral

bride cancel marriage for silly reason and news got viral

Viral News : పెళ్లి అనేది జీవితంలో ఎంతో ముఖ్యమైన విషయం. అమ్మాయికి అయిన, అబ్బాయికి అయిన తమ జీవిత భాగస్వామిని ఎంచుకునే విషయంలో ఏవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. అయితే అమ్మాయికి, అబ్బాయికి చేసుకోబోయే వ్యక్తి ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది అని ఏవేవో అనుకుంటారు. కొన్ని సార్లు వాళ్ళ అంచనాలకు తగ్గ రీతిలో అవతలి వ్యక్తి లేనప్పుడు ఆ సంబంధం ఓకే అవ్వదు. సాధారణంగా అమ్మాయిలు అబ్బాయి నల్లగా ఉన్నాడనో, పొట్టిగా ఉన్నాడనో, చెడు అలవాట్లు ఉన్నాయోనో లేకు అతడికి మంచి ఆస్తి లేదనో పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటారు. అయితే ఇక్కడ ఒక విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది.

వరుడి ముక్కు చిన్నగా ఉందని ఓ పెళ్ళికూతురు వివాహానికి నిరాకరించిన ఘటన ఇప్పుడు అందరితో నవ్వులు పూయిస్తుంది. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్ లోని సంభాల్ జిల్లాలో చోటు చేసుకుంది. వరుడి కుటుంబం ఊరేగింపుగా వధువు ఇంటికి వచ్చింది. అప్పటికే పెళ్లి కూతురు ఇంటి దగ్గర జనం చేరారు. అందులో ఉన్న కొందరు మహిళల దృష్టి పెళ్లి కొడుకు ముక్కు ముక్కు చిన్నగా ఉందని మాట్లాడుకోవడం పెళ్లి కూతురు విన్నది. దీంతో నాకీ పెళ్లి వద్దు, క్యాన్సిల్ అనేసింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు, వరుడు తరుపు వారు కూడా ఒక్కసారిగా ఖంగుతున్నారు.

ఈ అనుకోని ఘటనతో ఎవరికి ఏం చెప్పాలో అర్దం కాలేదు. కాగా, కుటుంబసభ్యులు ఎంత చెప్పినా పెళ్లి కూతురు వినిపించుకోలేదు. పెళ్లి వద్దు అంటే వద్దు అంటే భీష్మించుకొని ఉంది. ఇక వరుడి కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. అయితే పోలీసులు కూడా చివరికి చేసేది ఏమిలేక ఉండడంతో పెళ్లి కొడుకు ఫ్యామిలీ అంతా నిరాశతో వెనుదిరిగారు. దీంతో ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

Exit mobile version