Balakrishna on Ramayanam: నందమూరి బాలకృష్ణ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వీర సింహరెడ్డి సినిమా సక్సెస్ మీట్ లో మాట్లాడిన ఆయన రామాయణంపై నోరు జారారు. దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి.
నటసింహం నందమూరి బాలకృష్ణ తాజాగా నటించిన చిత్రం వీరసింహరెడ్డి.
ఫ్యాక్షన్ సినిమాకు బాలకృష్ణ పెట్టింది పేరుగా నిలిచారు.
ఈ సినిమా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందింది.
ఈ సినిమాలో బాలయ్య తన నటవిశ్వరూపాన్ని ప్రదర్శించారు.
నందమూరి బాలకృష్ణ తాజాగా నటించిన చిత్రం వీర సింహారెడ్డి (Veera Simha Reddy).
సంక్రాంతి బరిలో నిలిచిన ఈ చిత్రం భారీ విజయాన్ని నమోదు చేసుకుంది.
అఖండ విజయంతో ఊపు మీదున్న బాలయ్య.. వీర సింహారెడ్డితో మరో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు.
ఇక ఈ సినిమా సక్సెస్ మీట్ లో బాలయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
రామాయణాన్ని గాడిద గుడ్డు అనడంతో ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
దేవ బ్రహ్మణులను క్షమాపణ కోరిన బాలయ్య
ఇది వరకే దేవ బ్రహ్మణులను కించపరిచేలా బాలయ్య వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలు వైరల్ అవ్వడంతో బాలయ్య ఆ వర్గానికి క్షమాపణ కోరారు.
తాను అనుకోకుండా నోరు జారినట్లు బాలయ్య వివరణ ఇచ్చారు.
ఇక మరో సక్సెస్ మీట్ లో మాట్లాడిన బాలయ్య బాబు మాటాలు వైరల్ అయ్యాయి.
ఉపనిషత్తులు, వేదాలు, రామాయణం గాడిద గుడ్డు(Balakrishna on Ramayanam) అని ఎన్నో అంటాం.
రామాయణం మన జీవితం ఎలా నడుచుకోవాలో చెప్తుంది.
మహాభారతం మన ఎలా నడుచుకుంటున్నామనే దాని గురించి చెబుతుంది అన్నారు.
ఇక ఈ సినిమాలో ఫైట్స్, డైలాగ్ బాలయ్య అభిమానులను ఉర్రూతలుగించాయి.
సంక్రాంతి బరిలో నిలిచిన ఈ సినిమా భారీ హిట్ గా నిలించింది.
ఈ సినిమాకు అన్నిప్రాంతాల నుంచి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
బాలయ్య చేసిన వ్యాఖ్యలపై ఎలాంటి వ్యతిరేకత వస్తుందో చూడాలి.
ఈ వ్యాఖ్యలపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం ఉంది.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/