Site icon Prime9

Anant Ambani pre-wedding celebrations 2.0: అనంత్‌ అంబానీ ప్రీ వెడ్డింగ్‌ సెలెబ్రేషన్స్‌ 2.0 .. రూ,320 కోట్లు ఫీజు తీసుకుంటున్న కెటి పెర్రీ

Anant Ambani

Anant Ambani

Anant Ambani pre-wedding celebrations 2.0: దేశంలో ఒక వైపు ఎగ్జిట్‌ పోల్‌ హడావుడి…. మరో పక్క ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు ముఖేష్‌ అంబానీ కుమారుడు అనంత్‌ అంబానీ- రాధికా మర్చంట్‌ ప్రీ వెడ్డింగ్‌ సెలెబ్రేషన్స్‌.. ప్రస్తుతం జాతీయ మీడియాలో అంబానీ కుటుంబం ప్రీ వెడ్డింగ్‌ సెలెబ్రేషన్‌ గురించి ఆసక్తికరమైన కథనాలు వెలువడుతున్నాయి. కాగా అనంత్‌ అంబానీ ప్రీ వెడ్డింగ్‌ సెలబ్రేషన్‌ 1.0 గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెలెబ్రెటీలు విచ్చేశారు. మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ నుంచి మెటా చీఫ్‌ మార్క్‌ జుకర్‌బర్గ్‌ వరకు విచ్చేశారు. అప్పుడు రిహానా అతిథులను ఎంటర్‌టెయిన్‌ చేశారు. రిహానాకు భారీ మొత్తంలో డబ్బులు ముట్టాయని సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు హల్‌చల్‌ చేశాయి.

లగ్జరీ క్రూయిజ్ లో వేడుకలు..(Anant Ambani pre-wedding celebrations 2.0)

ప్రస్తుతం అనంత్‌ అంబానీ, రాధికా మర్చంట్‌ ప్రీ వెడ్డింగ్‌ సెలెబ్రేషన్‌ ఇటలీ నుంచి ఫ్రాన్స్‌కు వెళుతున్న లగ్జరీ క్రూయిజ్ లో జరుగుతున్నాయి. ఈ ప్రీ వెడ్డింగ్‌ సెలెబ్రేషన్స్‌కు 800 మంది కంటే ఎక్కువ మంది అతిథులకు ఆహ్వానం అందింది. బాలీవుడ్‌ నుంచి షారూఖ్ ఖాన్ ఆయన పిల్లలు, రణబీర్‌కపూర్‌, ఆలియా, రణవీర్‌ సింగ్‌, కరీనాకపూర్‌, కరిస్మాకపూర్‌ఖాన్‌, కరణ్‌జోహార్‌, జాన్వీకపూర్‌, సారా అలీఖాన్‌, అనన్యపాండేలు గెస్ట్‌ లిస్టులో ఉన్నారు. ఇటు సినీతారలే కాకుండా క్రీడాకారులు,వ్యాపారవేత్తలు కేవలం ఇండియా నుంచే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెలెబ్రిటీలు ప్రస్తుతం అనంత్‌, రాధికా మర్చంట్‌ ప్రీ వెడ్డింగ్‌ సెలెబ్రేషన్స్‌లో అటెండ్‌ అవుతున్నారు. అయితే ఇప్పుడు అందిరి మదిని తొలుస్తున్న అంశం అనంత్‌ ప్రీ వెడ్డింగ్‌ సెలెబ్రేషన్‌లో ఎంటర్‌ టెయిన్‌ చేసే ఆర్టిస్టులు ఎంత మొత్తం వసూలు చేస్తారో అన్న ఆసక్తి నెలకొంది. దీనికి సంబంధించి వివరాలు తెలుసుకుందాం.

ఈ సెలెబ్రేషన్‌లో కెటీ పెర్రీ పాల్గొంటున్నారన్న టాక్‌ వినిపిస్తోంది. ఇటలీ నుంచి ఫ్రాన్స్‌ వరకు విలాసవంతమైన క్రూయిజ్ లో ఆమె అతిథులను ఎంటర్‌టెయిన్‌ చేస్తారు. ఆమెకు చెల్లించే మొత్తం సుమారు 40 మిలియన్‌ డాలర్లు అంటే సుమారు రూ.320 కోట్లు ఫీజు వసూలు చేస్తారని వినికిడి. అటు తర్వాత ఎకాన్‌ ఒకరు. ఆయన తన పాటలతో ఉర్రూతలూగిస్తాడు. ఆయన చార్జీ విషయానికి వస్తే మూడు లక్షల డాలర్ల నుంచి 499,000 డాలర్ల వరకు ఉంటుది. ఇండియన్‌ కరెన్సీ ప్రకారం చూస్తు రెండు కోట్ల నుంచి నాలుగు కోట్ల వరకు ఉంటుంది. ఇక ఆయన పాటల విషయానికి వస్తే చమ్మక్‌ చెల్లో షారూఖ్‌ కాన్‌ నటించిన రా వన్‌ లోనింది. సినిమా విడుదలై కొన్ని సంవత్సరాలు గడిచినా.. ఇప్పటి మన పెళ్లిళ్లలో ఈ పాట వినిపిస్తోంటోంది.

రిహానా ఫీజు రూ.66 కోట్లు..

రిహానా విషయానికి వస్తే ఆమె సాధారణం 1.5 మిలియన్‌ డాలర్లు అంటే రూ.12 నుంచి 8 మిలియన్‌ డాలర్లు అంటే రూ.66 కోట్ల వరకు ప్రైవేట్‌ ఫంక్షన్‌లో పాల్గొన్నందుకు చార్జీ వసూలు చేస్తారు. ఇక బాలీవుడ్‌కు చెందిన దిల్జిత్‌ దోసాంజ్‌ను తీసుకొంటే పెళ్లిళ్లలో పాటలు పాడి ఎంటర్‌టెయిన్‌ చేసినందుకు సుమారు రూ.4 కోట్ల వరకు వసూలు చేస్తాడు. గతంలో కూడా అంబానీ ఇంట్లో జరిగిన ఇలాంటి వెడ్డింగ్‌లో కూడా రూ.4 కోట్ల వరకు వసలు చేశాడని వినికిడి. ఇక అరిజిత్‌ సింగ్‌ను తీసుకుంటే ఇలంటి ప్రైవేట్‌ పంక్షన్‌లలో పాడితే రూ.5 కోట్ల వరకు చార్జీ వసూలు చేస్తాడు. ఇక అంబానీ ఇంట జరిగే ఫంక్షన్‌లో ఆయన పాల్గొంటే ఇంతే మొత్తం వసూలు చేస్తాడన్న టాక్‌ వినిపిస్తోంది.

ఇక శ్రేయాగోషాల్‌ను తీసుకుంటే ఆమె ఒక్కో పాటకు ఇంత అని తీసుకుంటారు. ప్రయివేట్‌ ఫంక్షన్‌లలో ఆమె ఒక్కో పాటకు రూ.25 లక్షల వసూలు చేస్తారు. ఎన్నిపాటలు పడితే దానికి తగ్గట్టు గిట్టుబాటు అవుతుంది. ఇక ప్రీతమ్‌ విషయానికి వస్తే ఆయన ప్రైవేట్‌ ఫంక్షన్‌లలో ఎంటర్‌టెయిన్‌ చేస్తే సుమారు రూ.40 నుంచి రూ.50 లక్షలు వసూలు చేస్తారు. ఇక ఉదిత్‌ నారాయణను తీసుకుంటే ఇలాంటి పెళ్లిళ్లలో పాటలు పాడాలంటే రూ.22 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు చార్జీ వసూలు చేస్తాడు. అంబానీ ఇంట జరిగిన ఇలాంటి శుభకార్యాలయాలల్లో పాల్గొనందుకు ఇంతే మొత్తం లభించిందన్న టాక్‌. ఇక బి పారిఖ్‌ విషయానికి వస్తే ఆయన కూడా శ్రేయా గోషాల్‌ మాదిరిగా ఒక్కో పాటకు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ప్రైవేట్‌ ఫంక్షన్‌లలో చార్జీ వసూలు చేస్తాడు.

కాగా అనంత్‌ అంబానీ.. రాధికా మర్చంట్‌ ప్రీ వెడ్డింగ్‌ పెస్టివిటీస్‌లో మొహిత్‌ చౌహాన్‌, శిబానీ దండేకర్‌, షాన్‌, సుఖ్‌వీందర్‌సింగ్‌, మోనాలీ థాకూర్‌, నీతి మోహన్‌, వియన్నా సింఫనీ ఆర్కెస్ర్టాలు వరుడు తరపున వచ్చిన అతిథులకు వినోదం పంచుతుంటారు.

 

Exit mobile version