Site icon Prime9

Amazon : ఇండియాలో ఫుడ్ డెలివరీ వ్యాపారానికి గుడ్ బై చెబుతున్న అమెజాన్

Amazon

Amazon

Amazon India: ఈ ఏడాది చివర్లో భారత్‌లో ఫుడ్ డెలివరీ వ్యాపారాన్ని మూసివేయనున్నట్టు అమెజాన్ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 10,000 మందిని తొలగిస్తున్నట్లు కంపెనీ ప్రకటించిన నేపథ్యంలో ఈ చర్య తీసుకుంది. మహమ్మారికి ముందు కంపెనీ మూడేళ్ల క్రితం వ్యాపారాన్ని ప్రారంభించింది. బెంగళూరులో కంపెనీ నిర్వహిస్తున్న అమెజాన్ ఫుడ్ వ్యాపారాన్ని నిలిపివేయనున్నట్లు తెలిపింది.

“మా వార్షిక నిర్వహణ ప్రణాళిక సమీక్ష ప్రక్రియలో భాగంగా, మేము అమెజాన్ ఫుడ్‌ను నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నాము” అని కంపెనీ ప్రతినిధి రాయిటర్స్‌తో అన్నారు. ప్రస్తుత కస్టమర్‌లు మరియు భాగస్వాములను జాగ్రత్తగా చూసుకోవడానికి మేము ఈ కార్యక్రమాలను దశలవారీగా నిలిపివేస్తున్నామని పేర్కొన్నారు. గత సంవత్సరం ప్రారంభించబడిన అమెజాన్ అకాడమీ ప్లాట్‌ఫారమ్‌ను భారతదేశంలో మూసివేస్తున్నట్లు అమెజాన్ తెలిపింది.

ఆగస్టు 2023 నుండి భారతదేశంలో అమెజాన్ అకాడమీ కార్యకలాపాలు అనే ఎడ్‌టెక్ ఆఫర్‌ను మూసివేస్తున్నట్లు మరియు ప్రస్తుత అకడమిక్ బ్యాచ్‌లో నమోదు చేసుకున్న వారికి పూర్తి రుసుమును రీఫండ్ చేస్తామని గురువారం అమెజాన్ తెలిపింది.

 

Exit mobile version