Site icon Prime9

Tourist Places: ఇంటర్నెట్ లేని ప్రపంచంలోకి వెళ్లాలనుకుంటున్నారా.. అయితే ఈ ప్రదేశాలకు వెళ్లిరండి

flowers valley in Uttarakhand

flowers valley in Uttarakhand

Tourist Places: ఈ డిజిటల్ ప్రపంచంలో మనం రోజూ చాలా పనులను చకచకా చేసేసుకుంటున్నాం. అనేక ఒత్తిడిలు, హర్రీబర్రీల మధ్య నిత్యం పరుగులు పెడుతూ ఉంటాం. కానీ ఒక్కోసారి వీటన్నింటి నుంచి తప్పించుకోవాలని మనసు ఉవ్విలూరుతుంది. ఇంటర్నెట్ లేని ప్రపంచం ఏదైనా ఉంటే బాగుండు కొద్దిరోజులు అక్కడకు వెళ్లి రావచ్చు అనుకుంటుంటారు కొందరు. అయితే పచ్చని ప్రకృతితో, ప్రశాంతమైన మరో ప్రపంచంలో స్వేచ్ఛగా విహరించాలనుకుంటే ఈ అద్భుతమైన ప్రదేశాలు మీకు ఎంతగానో సహాయపడతాయి. మరి అవేంటో ఓ సారి చూసెయ్యండి.

అగుంబే, కర్ణాటక
దక్షిణ భారత చిరపుంజిగా అగుంబే అనే ప్రాంతం ప్రసిద్ధి. ఇది కర్ణాటక రాష్ట్రంలోని ఒక అందమైన గ్రామం. అనేక జలపాతాలు, చిరుజల్లుల పలకరింపులు, పరవశింపజేసే ప్రకృతి మనోహరమైన దృశ్యాలతో కూడిన ఈ ప్రాంతం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది.

అండమాన్, నికోబార్ దీవులు
అండమాన్, నికోబార్ దీవుల్లో కొన్ని ప్రదేశాలలో మినహా, ఎక్కడా మనకు సరైన ఇంటర్నెట్ సౌకర్యాలు అందుబాటులో ఉండవు. కాబట్టి ఫోన్ పక్కనపెట్టి లోతైన మహాసముద్రాలు, ఎగిసే నీలిరంగు అలలు, ఆశ్చర్యపరిచే సూర్యాస్తమయాలు, వెచ్చని ఇసుక తిన్నెలు ఇలా ఎన్నింటినో ఈ దీవులలో అనుభూతి చెందవచ్చు.

స్వర్గరోహిణి, ఉత్తరాఖండ్
ఉత్తరాఖండ్‌లోని స్వర్గరోహిణి అనేది సుందరమైన ప్రదేశం. ఇది ద్రౌపది, పాండవులు నడిచిన మార్గం అని అక్కడి ప్రజలు విశ్వాసం. ఈ ప్రదేశం స్వర్గానికి ట్రెక్ అని ప్రసిద్ధి చెందింది. ఇక్కడ సందర్శించడానికి అనువైన సమయం మార్చి నుండి డిసెంబర్ మధ్య ఉంటుంది.
ఈ రాష్ట్రంలోనే ‘ఫ్లవర్ వ్యాలీ’అనే మరో పర్యాటక ప్రదేశం కూడా ఉంది. కనుచూపు మేరలో ఎటు చూసిన అందమైన పూల వనాలతో అదో అద్భుత లోకంలా కనిపిస్తుంది.

ఐస్ కింగ్‌డమ్‌, జన్స్కార్, లద్దాఖ్
తెల్లటి, చల్లటి మంచు ఎడారిలో మధురానుభూతులు పొందాలంటే లద్దాఖ్ లోని ఐస్ కింగ్‌డమ్‌కు వెళ్లిపోండి. ఇక్కడ సెల్ ఫోన్ కవరేజీ ఉండదు.

ఇదీ చదవండి: ఆ ఊర్లల్లో సూర్యుడే ఉదయించడు తెలుసా..!

Exit mobile version