Site icon Prime9

Sardinia: ఇళ్లు కట్టుకోవడానికి రూ.12లక్షలు ఫ్రీ… ప్రభుత్వం బంపర్ ఆఫర్..!

sardinia dweep in italy

sardinia dweep in italy

Sardinia: మధ్యతరిగతి ప్రజలు ఇళ్లు కట్టుకుంటే చాలు.. జీవితంలో అదే గొప్ప విజయంగా భావిస్తారు. అలాంటిది ప్రభుత్వమే ఫ్రీగా ఇళ్లుకట్టుకోవడానికి కావాల్సిన డబ్బును ఇస్తాం అంటే ఇంక ఎలా ఉంటుందో చెప్పండి. ఎగిరిగంతేసి.. దొరకిందే ఛాన్సుగా ఇరుగు పొరుగు అందరికీ చెప్పి వెంటనే ప్రభుత్వానికి అర్జీలు పెట్టమూ.. మరి ఆ అవకాశం ఏ ప్రభుత్వం ఇచ్చింది.. ఎందుకు అంత డబ్బు ఫ్రీగా ఇస్తా అనిందో చూద్దామా..

ఇటలీ అధీనంలో ఉన్న దీవి సార్డీనియా. ఇది మధ్యదరా సముద్రంలోని రెండో అతిపెద్ద దీవి. అయితే ఈ అందాల దీవిలో స్థిరపడటానికి వచ్చిన వాళ్లకి అక్కడి ప్రభుత్వం 15 వేల యూరోలు అంటే మన పరిభాషలో సుమారు రూ.12 లక్షలు అనమాట ఇంత డబ్బును ఫ్రీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ దీవికి వెళ్లి స్థిరపడాలనుకునే వారి కోసం ఓ పథకాన్ని కూడా ప్రవేశపెట్టింది. దానికిగానూ ఇటలీ ప్రభుత్వం 45 మిలియన్‌ యూరోలు అంటే రూ.356 కోట్లు కేటాయించిందట. ఈ పథకం కింద డబ్బు తీసుకున్నవారు సార్డినీయా దీవిలోని ఏదైనా పట్టణం లేదా గ్రామంలో ఇల్లు కొనుక్కోవచ్చు లేదా మరమ్మతులు చేయించుకోవచ్చు అంట. అంతేకానీ మరే ఇతరత్రా అవసరాలకు ఈ డబ్బును ఉపయోగించకూడదనే రూల్ పెట్టంది.

అయితే జనాల్సి ఉండమని చెప్పడానికి ఇంత డబ్బు ఖర్చు పెట్టాల్సి అవసరం ఏంటి అంటే అద్భుతమైన వాతావరణం, చక్కని ప్రకృతి వనరులు ఉన్నా.. ఆ దీవిలో నివసించడానికి జనాభా ముందుకురావడం లేదట అందుకోసమే ఇటలీ ప్రభుత్వం ఇటీవలె ఈ బంపర్ ఆఫర్ను ఇచ్చింది.

ఇదీ చూడండి: Rainbow River: విశ్వసుందరి కిరీటం ఆ నది సొంతం.. ఎందుకో తెలుసా..!

Exit mobile version