Prime9

KTR: కేటీఆర్ కు కరోనా

KTR: తెలంగాణఐటీ, మున్సిపల్ శాఖా మంత్రి, కల్వకుంట్ల తారక రామారావు కు కరోనా సోకింది. స్వల్ప లక్షణాలతో కొవిడ్ -19 పరీక్ష నిర్వహించుకోగా.. పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపారు. గత కొద్ది రోజులుగా తనను కలిసిన వారందరూ కొవిడ్ టెస్టు చేసుకోవాల్సిందిగా కేటీఆర్ ట్వీట్ చేశారు.

2021 ఏప్రిల్‌లో మంత్రి కేటీఆర్ ఒకసారి క‌రోనా బారిన ప‌డ్డారు. తాజాగా మ‌రొకసారి ఆయన ఈ వైరస్ బారిన ప‌డ్డారు. కొద్ది రోజుల కిందట కాలికి గాయం కావడంతో కేటీఆర్ ఇంట్లోనే ఉండి, కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటున్నారు.

Exit mobile version
Skip to toolbar