Prime9

Heavy Rush in Saraswati Puskaralu: కాళేశ్వరానికి పోటెత్తిన భక్తులు.. నేటితో ముగియనున్న పుష్కరాలు

Heavy Rush in Saraswati Puskaralu: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరానికి భక్తులు పోటెత్తారు. గత 12 రోజులుగా జరుగుతున్న సరస్వతి పుష్కరాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించి గంగమ్మకు దీపాలు వదులుతున్నారు. కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు. దీంతో కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో రద్దీ నెలకొంది.

 

మరోవైపు సరస్వతి పుష్కరాలు నేటితో ముగియనున్నాయి. ఇవాళ రాత్రి 7.45 గంటలకు నవరత్నమాల హారతితో పుష్కరాలు సమాప్తం కానున్నాయి. పుష్కరాల ముగింపు వేళ వీఐపీ ఘాట్ వద్ద నేడు ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. సాయంత్రం 6 గంటల నుంచి వేద స్వస్తి కార్యక్రమం, బ్రహ్మశ్రీ నాగ ఫణిశర్మ సందేశం, మంత్రుల ప్రసంగాలు ఉంటాయని అధికారులు తెలిపారు. రాత్రి 7.46 నుంచి 7.54 గంటల వరకు డ్రోన్ షో నిర్వహించనున్నారు. నేడు ఆఖరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు కాళేశ్వరానికి రానున్నారు. ఈ నేపథ్యంలో వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.

 

Exit mobile version
Skip to toolbar