Prime9

5 died in Godavari River: బాసరలో విషాదం.. గోదావరిలో మునిగి ఐదుగురు మృతి..!

5 died in Godavari River at Basara: నిర్మల్ జిల్లా బాసరలో తీవ్ర విషాదం నెలకొంది. గోదావరిలో మునిగి ఐదుగురు యువకులు మృతిచెందారు. హైదరాబాద్ కు చెందిన 18 మంది సభ్యుల కుటుంబం అమ్మవారి దర్శనానికి బాసర వచ్చింది. గోదావరి స్నానం చేస్తుండగా నదిలో మునిగి ఐదుగురు మృతిచెందారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. యువకులు నదిలో మునిగిపోతుండగా పలువురు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రెస్క్యూ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చేపట్టగా ఐదుగురి మృతదేహాలు లభించాయి.

 

మృతులది హైదరాబాద్ లోని దిల్ సుఖ్ నగర్ గా నిర్ధారించారు. వీరిని రాకేష్ (17), వినోద్ (18), మదన్ (18), రుతిక్, భరత్ గా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం భైంసా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే అమ్మవారి దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో గోదావరిలోకి దిగగా ప్రమాదం జరిగి ఉండొచ్చని పలువురు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

 

Exit mobile version
Skip to toolbar