Prime9

Uttam Kumar Reddy: రెండు కోట్లు స్వాహా.. ఉత్తమ్ కుమార్ రెడ్డి

Huzurnagar: ఎమ్మెల్యే సైదిరెడ్డి ప్రమేయంతోనే హుజూర్ నగర్ పురపాలక సంఘంలో రెండు కోట్ల మేర అవినీతి చోటుచేసుకొందని నల్గొండ పార్లమెంటు సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు అవినీతి నిగ్గు తేల్చాలని తాను సీఎం కేసిఆర్, మంత్ర కేటిఆర్ లకు లేఖ వ్రాస్తున్నట్లు ఆయన తెలిపారు.

గడిచిన 9నెలలుగా హుజూర్ నగర్ పురపాలక సంఘంలో సర్వ సభ్య సమావేశాన్ని పెట్టకపోవడాన్ని తప్పబట్టారు. దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ముందస్తు అనుమతులు పేరుతో కోట్లు తినేసారని ఆయన మండిపడ్డారు. కమీషనర్ అవినీతి తొత్తుగా మారాడని ఆయన విమర్శించారు. ఏ మునిసిపాలిటీ లో లేని విధంగా నిధులను దోచేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. నిబంధనలను తుంగలో తొక్కి మరీ అవినీతికి పాల్పొడ్డారని ఆయన పేర్కొన్నారు. మునిసిపాలిటీలో పాలన నత్తనడకన సాగుతుందని, పారిశుధ్య అధికారి, టిపిఎస్, డిపివో, ఫుల్ టైం డిఇ, ఆర్ఐ లేకపోవడంపై ఏమని స్పందిస్తారని ప్రశ్నించారు.

ఇది కూడా చదవండి: రాజాసింగ్ ప్రాణాలకు ముప్పు.. విజయశాంతి

Exit mobile version
Skip to toolbar