Telangana Congress: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తొలి విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. 55 మంది అభ్యర్థులను తొలి లిస్ట్‌లో భాగంగా ప్రకటించింది. ఈ మేరకు కేసీ వేణుగోపాల్ జాబితాను విడుదల చేశారు.
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్లు తొలి లిస్టులో లేకపోవడం గమనార్హం. ఇటీవల పార్టీలో చేరిన మైనంపల్లి హన్మంతరావు, ఆయన కుమారుడు మొదటి జాబితాలోనే చోటు సంపాదించుకున్నారు.ఈ జాబితాలో 12 మంది ఎస్సీలు, ఇద్దరు ఎస్టీలకు చోటు కల్పించారు. వెలమ-7, రెడ్డి-17, ముస్లీం-3 బీసీ-12 మందికి మొదటి జాబితాలో చోటు దక్కింది.
కొత్తగా పార్టీలో చేరిన 12 మందికి టికెట్లుతొలి జాబితాలో 58 మంది పేర్లు ఉంటాయని మొదట ప్రచారం జరిగింది. ఐతే… చివరి నిమిషంలో మూడు స్థానాల అభ్యర్థుల పేర్లను తొలగించి, 55 మంది పేర్లతో జాబితా రిలీజ్ చేశారు.
కాంగ్రెస్ ప్రకటించిన అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితాలో పార్టీలో ఇటీవలే చేరిన వారిలో 11మంది నేతలకి టికెట్లు దక్కాయి. మెదక్‌నుంచి మైనంపల్లి రోహిత్ రావు, మల్కాజ్ గిరినుంచి మైనంపల్లి హన్మంత రావు, నిర్మల్‌నుంచి కూచాడి శ్రీహరి రావు,నకిరేకల్‌నుంచి వేముల వీరేశం, ఆర్మూర్‌నుంచి వినయ్ కుమార్ రెడ్డి, బాల్కొండనుంచి సునీల్ రెడ్డి, జహీరాబాద్‌నుంచి ఎ. చంద్ర శేఖర్, కల్వకుర్తినుంచి కసిరెడ్డి నారాయణ రెడ్డి, గద్వాలనుంచి సరిత, కొల్లాపూర్‌నుంచి జూపల్లి కృష్ణారావు, నాగర్ కర్నూల్‌నుంచి కూచుకుళ్ల రాజేష్ రెడ్డికి కాంగ్రెస్ అభ్యర్థిత్వం దక్కింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానాలకి సంబంధించి మొదటి లిస్టులో ఖమ్మం, పాలేరు అభ్యర్థుల పేర్లు లేవు. దీంతో ఉత్కంఠ నెలకొంది. మొదటి లిస్టులో మధిర సిట్టింగ్ భట్టి విక్రమార్క, భద్రాచలం సిట్టింగ్ పొదెం వీరయ్యకు టికెట్లు దక్కాయి. ఖమ్మంనుండి తుమ్మల, పాలేరునుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోటీచేయనున్నారని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం లీకులు ఇచ్చింది. కానీ వారి పేర్లు మొదటి లిస్టులో లేవు. ఖమ్మం, పాలేరు సీట్లలో అభ్యర్థులు ఎవరనే విషయంపై పార్టీలో గందరగోళం నెలకొంది.