Site icon Prime9

Telangana Polls: తెలంగాణలో దూసుకెడుతున్న కాంగ్రెస్ పార్టీ

Congress Party

Congress Party

Telangana Polls: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తోంది. హంగ్‌కి ఏ మాత్రం అవకాశం లేని రీతిలో దూసుకు పోతోంది. కాంగ్రెస్ పార్టీ 61 స్థానాల్లో లీడింగులో ఉండి మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. రెండవ స్థానంలో బిఆర్ఎస్ 30 స్థానాల్లో కొనసాగుతోంది. బిజెపి 11, ఎంఐఎం 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.

ఉత్తర, దక్షిణ తెలంగాణలో హస్తానిదే హవా..(Telangana Polls)

ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ లో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యం కొనసాగిస్తోంది. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ,మహబూబ్ నగర్ జిల్లాల్లో కాంగ్రెస్ దూసుకువెడుతోంది. అయితే గ్రేటర్ హైదరాబాద్ లో మాత్రం బీఆర్ఎస్ ముందంజలో ఉండటం గమనార్మం. పాత రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తోంది. సీఎం కేసీఆర్ తాను పోటీ చేసిన గజ్వేల్ అసెంబ్లీ స్దానంలో ఆధిక్యంలో ఉండగా కామారెడ్డిలో తన ప్రత్యర్ది, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కన్నా వెనుకబడి ఉన్నారు. మరోవైపు బీజేపీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా పలు స్దానాల్లో ప్రధాన పార్టీలు రెండింటికి గట్టి పోటీ నిస్తోంది. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ బీజేపీ సింగిల్ డిజిట్ దాటవని చెప్పాయి. అయితే పలు చోట్ల బీజేపీ అభ్యర్దులు కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు గట్టి పోటీ నిచ్చారు. మొత్తంమీద పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు స్పష్టమవుతోంది.

రంగంలోకి ట్రబుల్ షూటర్..

కర్ణాటక డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్ గా పేరొందిన డికె శివకుమార్ హైదరాబాద్ లో మకాం వేసారు. ఒకవేళ హంగ్ వచ్చినా, కాంగ్రెస్ కు మెజారటీ వచ్చినా బీఆర్ఎస్ కు ఎటువంటి చాన్స్ ఇవ్వకూడదనే ఆలోచలో ఆయన ఉన్నారు. అందువలన ఆదివారం గెలుపొందిన అభ్యర్దులందరినీ హైదరాబాద్ తాజ్ కృష్ణా హోటల్ కు రావాలని ఆదేశాలు జారీ చేసారు. ఆదివారం రాత్రి కాని లేదా సోమవారం గాని కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశం జరిగే అవకాశముంది.

Exit mobile version
Skip to toolbar