Site icon Prime9

WhatsApp: వాట్సాప్ లో మీతో మీరే ఛాట్ చేసే సరికొత్త ఫీచర్

interesting-details-about-whatsapp-new-features

interesting-details-about-whatsapp-new-features

WhatsApp: స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ ఒక ముఖ్యమైన యాప్ అయిపోయింది నేటి తరానికి. దానికి అనుగుణంగానే ప్రముఖ ఇన్‌స్టాంట్‌ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌​ వాట్సాప్​ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను జోడిస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉండగా తాజాగా వాట్సాప్ మరో కొత్త అప్డేటెడ్ ఫీచర్ తో వినియోగదారుల ముందుకు వచ్చింది. మరి అదేంటో చూసెయ్యండి.

వాట్సాప్ ఆండ్రాయిడ్, iOS యూజర్ల కోసం కొత్తగా “మెస్సేజ్ విత్ యువర్ సెల్ఫ్” (Messages with yourself) ఫీచర్‌ టెస్టింగ్ను ప్రారంభించింది. ఈ కొత్త అప్‌డేట్‌తో, మీరు మీ సొంత నంబర్‌కు చెందిన వాట్సాప్ చాట్‌ను ఓపెన్ చేసుకోవచ్చు. ఇలా చేసినప్పుడు యాప్ చాట్ క్యాప్షన్‌గా “మెస్సేజ్ యువర్ సెల్ఫ్” (Message yourself)ని యాడ్ చేయడం ద్వారా మీ పర్సనల్ చాట్ బాక్స్‌ను యూజర్లు పొందవచ్చు. దీనికి తోడుగా అదనపు యాక్సెస్ కోసం వాట్సాప్ కాంటాక్ట్ లిస్ట్‌లో మీ ఫోన్ నంబర్ కూడా కనిపిస్తుంది. ఈ ఫీచర్తో మీతో మీరే చాట్ చేసుకోవచ్చనమాట.

ఇదీ చదవండి: త్వరలో ఐఫోన్ యూజర్లకు 5g సేవలు

Exit mobile version